వారి మొండిబకాయిలు రూ.3.89 లక్షల కోట్లా? | Sakshi
Sakshi News home page

వారి మొండిబకాయిలు రూ.3.89 లక్షల కోట్లా?

Published Tue, Nov 22 2016 6:06 PM

వారి మొండిబకాయిలు రూ.3.89 లక్షల కోట్లా?

న్యూఢిల్లీ : పారిశ్రామిక వేత్తలు రుణ బకాయిలకు సంబంధించిన వివరాలను కేంద్రం నేడు పార్లమెంట్కు నివేదించింది. మొత్తం 2,071 మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించి రుణాలు రూ.3.89 లక్షల కోట్లు మొండిబకాయిలుగా(ఎన్పీఏలుగా) మారినట్టు కేంద్రం తెలిపింది. వారు రూ.50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని రుణాన్ని బ్యాంకుల వద్దనుంచి తీసుకున్నట్టు పేర్కొంది. 2016 జూన్ 30 వరకు రూ.50 కోట్లకు పైబడిన ఎన్పీఏ అకౌంట్ల పారిశ్రామికవేత్తలు 2,071 మంది ఉన్నారని, వారి మొత్తం మొండిబకాయిలు రూ.3,88,919 కోట్లగా ఉన్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
 
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సూచనల మేరకు, ప్రతి బ్యాంకుకు రుణాన్ని రికవరీ చేసుకునే సొంత పాలసీ ఉంటుందని, దానిలోనే రైటాఫ్స్ ప్రక్రియ కూడా కలిసి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్బీఐ రైటాఫ్స్ ప్రక్రియకు అనుమతించినప్పటికీ, బ్రాంచు స్థాయిలో వారి రుణాల రికవరీ ఉంటుందని సంతోష్ కుమార్ గంగ్వార్ చెప్పారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్న ఒక్క రూపాయి సంబంధించి కూడా ఏ బ్యాంకుకు వ్యతిరేకంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 2 వరకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్లు 25.45 కోట్లు తెరుచుకున్నాయని చెప్పారు. పేదలందరికీ బ్యాంకు అకౌంట్లను సమకూర్చడం ద్వారా ఫైనాన్సియల్ ఇక్లూజన్ సాధించడం కోసం ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement