ఒక్కసారిగా పురివిప్పిన నెమలిని ఎక్కడ తనను పొడుచుకుతింటుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని పరుగుపెడుతోన్న ఈ ఆరేళ్ల పాప ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలన్నీ ఇప్పుడా పాపను చుట్టేశాయి. సంబంధంలేని ఎన్నెన్నో సంఘటనల్లోకి ఆమెను లాగేశారు. ఇదంతా ఎలా జరిగిందంటే..
ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో ఓ పాఠకుడు తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. కూతురిని తీసుకుని చిన్నపిల్లల పార్కుకు వెళ్లామని, అయితే ఆ సందర్శన అనుకున్నంత సజావుగా (నెమలిని చూసి పాప భయపడిపోవడం వల్ల) జరగలేదని ఫొటో కింద కామెంట్ పెట్టాడు. రెడిట్ లో జూన్ 26న ఈ ఫొటో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఫొటోషాప్ కొట్లాట మొదలైంది. ఒక వ్యక్తి .. పాప భయాన్ని బ్రెగ్జిట్ తో ముడిపెడుతూ నెమలిని యురోపియన్ యూనియన్(ఈయూ)గా, పాపను ఈయూ నుంచి భయపడి పారిపోతున్న బ్రిటన్ గా పోల్చుతూ ఫొటోలో మార్పులు చేశాడు. ఇంకొకడు.. అలాకాదంటూ పాపను ట్రంప్ తో పోల్చాడు. ట్రంప్ (పాప) పరుగు పందెంలో ఉస్సేన్ బోల్ట్ తో పోటీపడుతున్నట్లు ఫొటోషాప్ చేశాడు. ఇలా పాప భయంపై లెక్కకు మిక్కిలిగా పుట్టుకొచ్చిన ఫొటోషాప్డ్ ఫొటోల పోట్లాట ఇంటర్నెట్ లో నడుస్తూనేఉంది..
పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట
Published Tue, Jun 28 2016 4:49 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM
Advertisement
Advertisement