కుందేలును చంపాడన్న ఆరోపణతో 23 ఏళ్లు జైల్లో పెట్టి, ఇప్పుడు ఆ కుందేలును అతడు చంపలేదని తేలడంతో దాదాపు 40 కోట్ల పరిహారాన్ని చెల్లించింది న్యూయార్క్ నగర కౌన్సిల్. డేవిడ్ రాంటా అనే ఆ వ్యక్తి తాను నిర్దోషినని ఎప్పుడూ చెబుతూనే ఉన్నా.. కోర్టు మాత్రం పట్టించుకోలేదు. 1990 నుంచి అతడు జైల్లో మగ్గుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు అతడు గత సంవత్సరం విడుదలయ్యాడు. కానీ, ఆ మర్నాడే అతడికి గుండెపోటు వచ్చింది. వెర్జ్బెర్గర్ అనే ఈ కుందేలు ఓ నగల దుకాణంలో దోపిడీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో చనిపోయింది.
దాంతో పోలీసులు డేవిడ్ రాంటాను అరెస్టుచేసి, అతడే దోషి అని కోర్టులో కూడా గట్టిగా చెప్పారు. చివరకు ఇన్నేళ్ల తర్వాత అతడు నిర్దోషి అని తేలడంతో విడిచిపెట్టడమే కాక, ఇన్నాళ్ల పాటు అన్యాయంగా జైల్లో ఉంచినందుకు పరిహారంగా దాదాపు రూ. 40 కోట్లు చెల్లించారు. చేతులు కాల్చుకోవడం, ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కదూ!!
23 ఏళ్లు జైల్లో పెట్టి.. 40 కోట్ల పరిహారం!!
Published Fri, Feb 21 2014 3:20 PM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM
Advertisement
Advertisement