-
త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న ఇతన్ని గుర్తుపట్టారా?
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ( Anant Ambani ), రాధికా మర్చంట్ల ( Radhika Merchant ) వివాహం త్వరలో జరగబోతోంది. మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అనంత్ అంబానీ బరువు తగ్గడం, ఆ తర్వాత పెరగడం గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ అనంత్ అంబానీ కొన్ని నెలల్లోనే 108 కిలోలు ఎలా తగ్గగలిగారు అని అందరూ ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటారు. అప్పట్లో ఆయన అంతలా బరువు తగ్గడానికి ప్రధాన కారణం ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా. ఎవరీ వినోద్ చన్నా? దేశంలోని ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన వినోద్ చన్నా, ఒకప్పుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పర్సనల్ ట్రైనర్. కఠినమైన ఆహారం, వ్యాయామ నియమావళి ద్వారా కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి అతను సహాయం చేశాడు. వినోద్ చన్నాది స్వయంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. అతను ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా కృషి చేశాడు. అతను ఒకప్పుడు చాలా బక్కపలచగా ఉండేవాడు. దీంతో అతన్ని అందరూ హేళన చేసేవారు. ఒక ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తాను పెరిగే సమయంలో పోషకాహార లోపంతో బాధపడేవాడినని చెప్పాడు. ఫిట్నెస్ ట్రైనర్‌గా విజయం సాధించడానికి ముందు వినోద్ చన్నా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డు వంటి చిన్న చిన్న పనులెన్నో చేశాడు. వినోద్ చన్నా పెరిగేకొద్దీ జీవితంలో ఫిట్నెస్ ప్రాముఖ్యతను గ్రహించి జిమ్‌లో చేరాడు. ఇదే అతని ప్రయాణాన్ని మలుపు తిప్పింది. అనంత్ అంబానీతో కలిసి పనిచేసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో వినోద్ చన్నా మాట్లాడుతూ.. బరువు తగ్గడంలో అనంత్ అంబానీ నిబద్ధతను తెలియజేశారు. అనంత్ అంబానీ కోసం అధిక ప్రోటీన్, హై ఫైబర్, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ప్రత్యేక డైట్ ప్లాన్ రూపొందించినట్లు వినోద్ చన్నా తెలిపారు. ఆయన ఫీజు ఎంతంటే.. అనంత్ అంబానీతో పాటు నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు వినోద్ చన్నా పర్సనల్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎంత చార్జ్ చేస్తారో చెప్పలేదు కదా.. 12 ట్రైనింగ్ సెషన్ల ప్యాకేజీకి వినోద్ చన్నా రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. -
అంత బరువు ఎలా తగ్గాడో తెలుసా?
ముంబై: ఐపీఎల్-9 నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ (21) మరోసారి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. గత ఐపిఎల్ సందర్భంగా భారీకాయంతో కనిపించిన అనంత్ అంబానీ ఏడాదిన్నరకల్లా స్లిమ్ గా తయారయ్యాడు. 108 కిలోల బరువు తగ్గి హ్యాండ్ సమ్ లుక్ లో ఆకట్టుకున్న అనంత్ అంబానీపై ఇపుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇదే సందర్భంలో ఇంత తక్కువ సమయంలో అంత బరువు తగ్గడం సామాన్య విషయంకాదనే ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఇంత స్వల్వ వ్యవధిలో అంత వేగంగా బరువు తగ్గడం అసాధ్యమని, అనంత్ గాస్ట్రిక్ బైపాస్ సర్టరీ చేయించుకున్నాడనే రూమర్లు కూడా షికారు చేశాయి. అయితే తాజా నివేదికల ప్రకారం ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండానే, కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా సహజ ప్రక్రియలోనే అతను బరువు తగ్గినట్టు తెలుస్తోంది. క్రానిక్ ఆస్తమా బాధపడుతున్న అనంత్ దాని నివారణకు తీసుకున్న మందుల ప్రభావంతో అనూహ్యంగా బరువు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంత భారీగా బరువుగా తగ్గడానికి అనంత్ చేసిన వ్యాయామేమీ తక్కువేమీకాదు. గంటకు అయిదునుంచి ఆరుగంటల పాటు భారీ కసరత్తులు చేసేవాడట. రోజుకు 21కి.మీ వాకింగ్ యోగాసనాలు, ప్రాణాయామం. దీంతో పాటుగా వెయిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ కార్డియో వ్యాయామాలు సరేసరి. ఇంత కఠోర వ్యాయామం అనంతరం స్లిమ్ అండ్ ట్రిమ్ అనంత్ అంబానీ మనముందు ప్రత్యక్షమయ్యాడన్నమాట. మరోవైపు అనంత్ విల్ పవర్ పైనా, ఈ స్లిమ్ లుక్ కోసం అతని కఠోర శ్రమ పైనా బాలీవుడ్ ప్రముఖులు సహా , క్రీడారంగ ప్రముఖులు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు 18 నెలల్లో 108 కిలోల బరువుతగ్గిన అనంత్ అంబానీ వివిధ రంగాల సెలబ్రిటీల దగ్గరుంచి, సామాన్య జనం దాకా హాట్ టాపిగ్గా మారిన సంగతి తెలిసిందే.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్‌పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్‌లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement