వ్యక్తి దుర్మరణం | Sakshi
Sakshi News home page

వ్యక్తి దుర్మరణం

Published Sat, May 18 2024 10:05 AM

-

మండపేట: ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలి కాగా ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మండపేటలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపిన వివరాల మేరకు.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన దాసరి శ్రీను(36) తన కుమార్తెను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని మండపేట వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామం పయనమయ్యాడు. పెద్ద కాలువ దాటిన తరువాత వీరభద్రపురం వచ్చే సరికి మాచవరం నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఆటో అతివేగంతో మోటారు సైకిల్‌ను ఢీ కొట్టింది. దీంతో మోటారు సైక్లిస్టు శ్రీను తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కుమార్తెకు కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అంబులెన్సు సాయంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టౌన్‌ సీఐ షేక్‌ అఖిల్‌జమ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement