టీడీపీ అరాచకం! | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకం!

Published Sat, Jun 15 2024 11:48 PM

టీడీపీ అరాచకం!

 గ్రామాలు వదిలి వెళ్లాల్సిందిగా మౌఖిక ఆదేశాలు

 వ్యక్తిగత ఆస్తులు, వ్యాపార, ఆదాయ వనరులను దెబ్బతీస్తున్న వైనం

 శరవేగంగా తెరపైకి వస్తున్న కక్షసాధింపు చర్యలు

సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సీట్లు దక్కాయని తెలుసుకోవడంతోనే తెలుగుతమ్ముళ్లు పేట్రేగిపోయారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పాళ్లు తగ్గుతాయని పరిశీలకులు భావించగా, మరింత ఎక్కువయ్యాయి. గ్రామాలు వదిలివెళ్లాల్సిందిగా కొంతమంది ఆదేశిస్తే, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే చర్యలకు మరికొందరు సిద్ధమయ్యారు. ఈక్రమంలో వ్యక్తిగత ఆస్తులు, వ్యాపార, ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేటేస్తున్నారు. మునుపెన్నడూ లేని దౌర్జన్యకర చరిత్రను లిఖిస్తున్నారు. రాజకీయ వైరి పక్షాలను టార్గెట్‌ చేస్తూ    కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.  

ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఓసారి ప్రజాతీర్పు తప్పదు. ప్రజాభీష్టం మేరకు పాలక పక్షాలు కొలువులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పారీ్టకి ప్రభుత్వ పగ్గాలు దక్కాయి. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా దౌర్జన్యకర ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలో జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం ప్రాంతాల్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ప్రైవేటు పాఠశాలలను మూసేయాల్సిందిగా కొందరు ఆదేశిస్తున్నారు. నిర్వాహకులు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చారనే భావనే అందుకు కారణంగా నిలుస్తోంది. కమలాపురం, వల్లూరు, సింహాద్రిపురం ఏరియాల్లో ఇలాంటి వ్యవహారం బహిర్గతమైంది. మరోవైపు అధికారులను ప్రయోగించి వ్యక్తిగత వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. 

గ్రామాలు వదిలి వెళ్లాల్సిందిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైరిపక్షాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ముద్దనూరు మండల మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి క్రషర్‌ సీజ్‌కు దారితీసినట్లు పలువురు వివరిస్తున్నారు. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెలో సర్పంచ్‌ శ్రీనివాసులకు చెందిన ప్రవేటు భూమిని ఆక్రమించి, నర్సరీని ట్రాక్టర్లతో మిల్లర్‌ కొట్టారు. కోర్టు పరిధిలో ఉన్న భూమి సైతం స్వా«దీనం చేసుకున్నారు. టీడీపీ వర్గీయులు పట్టపగలు యధేచ్ఛగా ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇలాంటి దౌర్జన్యకర ఘటనలు మునుపెన్నడూ లేకపోగా, ఈమారు క్రమం తప్పకుండా తెరపైకి వస్తుండడం విశేషం.

అధికారులపై కర్రపెత్తనం
అధికారంలోకి వచ్చీ రాగానే తెలుగుదేశాధీశులు కర్రపెత్తనం ఆరంభించారు. మాకు తెలియకుండా చిన్న సంతకం కూడా చేయరాదంటూ మండల స్థాయి అధికారులకు హుకుం జారీ చేశారు. పొజిషన్‌ సరి్టఫికేట్‌ ఇస్తే హౌసింగ్‌ లోన్‌ తెచ్చుకుంటానని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించిన ఓ వ్యక్తికి అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ నేత ఫోన్‌ లేదా సిఫార్సు లేఖ ఏదో ఒకటి కావాలని ఆ అధికారి కోరడం గమనార్హం. గడిచిన ఐదేళ్లు కులాలకు, మతాలకు రాజకీయ పార్టీలకతీతంగా ప్రభుత్వ పాలన అందింది. అయితే నేడు  భిన్నమైన పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాల్సిన ఆవశ్యకత ఉంది. అధికార యంత్రాంగం సైతం ప్రోత్సహించడం ఆక్షేపణీయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.   

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement