ముంబై: ఐపీఎల్-9 నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ (21) మరోసారి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. గత ఐపిఎల్ సందర్భంగా భారీకాయంతో కనిపించిన అనంత్ అంబానీ ఏడాదిన్నరకల్లా స్లిమ్ గా తయారయ్యాడు. 108 కిలోల బరువు తగ్గి హ్యాండ్ సమ్ లుక్ లో ఆకట్టుకున్న అనంత్ అంబానీపై ఇపుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇదే సందర్భంలో ఇంత తక్కువ సమయంలో అంత బరువు తగ్గడం సామాన్య విషయంకాదనే ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఇంత స్వల్వ వ్యవధిలో అంత వేగంగా బరువు తగ్గడం అసాధ్యమని, అనంత్ గాస్ట్రిక్ బైపాస్ సర్టరీ చేయించుకున్నాడనే రూమర్లు కూడా షికారు చేశాయి.
అయితే తాజా నివేదికల ప్రకారం ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండానే, కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా సహజ ప్రక్రియలోనే అతను బరువు తగ్గినట్టు తెలుస్తోంది. క్రానిక్ ఆస్తమా బాధపడుతున్న అనంత్ దాని నివారణకు తీసుకున్న మందుల ప్రభావంతో అనూహ్యంగా బరువు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంత భారీగా బరువుగా తగ్గడానికి అనంత్ చేసిన వ్యాయామేమీ తక్కువేమీకాదు. గంటకు అయిదునుంచి ఆరుగంటల పాటు భారీ కసరత్తులు చేసేవాడట. రోజుకు 21కి.మీ వాకింగ్ యోగాసనాలు, ప్రాణాయామం. దీంతో పాటుగా వెయిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ కార్డియో వ్యాయామాలు సరేసరి. ఇంత కఠోర వ్యాయామం అనంతరం స్లిమ్ అండ్ ట్రిమ్ అనంత్ అంబానీ మనముందు ప్రత్యక్షమయ్యాడన్నమాట.
మరోవైపు అనంత్ విల్ పవర్ పైనా, ఈ స్లిమ్ లుక్ కోసం అతని కఠోర శ్రమ పైనా బాలీవుడ్ ప్రముఖులు సహా , క్రీడారంగ ప్రముఖులు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు 18 నెలల్లో 108 కిలోల బరువుతగ్గిన అనంత్ అంబానీ వివిధ రంగాల సెలబ్రిటీల దగ్గరుంచి, సామాన్య జనం దాకా హాట్ టాపిగ్గా మారిన సంగతి తెలిసిందే.
అంత బరువు ఎలా తగ్గాడో తెలుసా?
Published Mon, Apr 11 2016 3:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM
Advertisement
Advertisement