-
వరల్డ్ టాప్ 100 ఎయిర్‌లైన్స్: మళ్లీ అదరగొట్టిన సంస్థ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు భారతీయ విమానయాన సంస్థలు చోటు సంపాదించు కున్నాయి. విమానయాన సంస్థలు విస్తారా, ఇండిగో మాత్రమే ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. టాప్ 100లో 49వ ర్యాంకు సాధించిన ఇండిగో మూడవ ఉత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా ఎంపికైంది. టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా 10 అత్యంత మెరుగైన విమానయాన సంస్థల జాబితాలో 9వ స్థానంలో ఉంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డుల ప్రకారం 2022లోని 20వ ప్లేస్నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి మరీ విస్తారా 16వ స్థానానికి చేరింది.అటు ఇండిగో గత సంవత్సరం 45వ స్థానం నుండి రెండు స్థానాలు పెరిగి 43వ ర్యాంక్‌కు చేరుకుంది. టాప్ 100 ఎయిర్‌లైన్స్‌కు స్కైట్రాక్స్ ఈ అవార్డులను ఇచ్చింది. అలాగే 20 ‘ప్రపంచపు అత్యుత్తమ ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ 2023’ జాబితాలో కూడా విస్తారా 19వ ప్లేస్ కొట్టేసింది. అంతేనా ఆసియాలోని టాప్ 10 ఎయిర్‌లైన్స్ జాబితాలో విస్తారా 8వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) ఎయిర్‌లైన్ స్కైట్రాక్స్ టాప్ 20 ఎయిర్‌లైన్స్ జాబితాలో వరుసగా రెండవ సారి స్థానం పొందింది విస్తారా.అలాగే వరుసగా మూడో ఏడాది కూడా 'బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా' అవార్డును, ఇండియా దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' గా వరుసగా ఐదవసారి, 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' మూడవసారి గెలుచుకుంది. దీంతోపాటు 'వరల్డ్స్ బెస్ట్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ 2023' విభాగంలో 20వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశీల నుంచి వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో ఓటు వేయగా, మొత్తం 20.23 మిలియన్ల ప్రయాణికుల నుండి ఓట్లు వచ్చాయి.విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ ఈ అవార్డులు తమ సేవలు, కస్టమర్ల నమ్మకంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమని మరింత ఉత్తేజితం చేస్తామన్నారు. తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ టీమ్‌లు, ఎనిమిదేళ్ల ప్రస్థానంలో విశేష కృషికి గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇండియా సౌత్ఏసియాలో ఉత్తమ విమానయాన సిబ్బంది అవార్డును ఐదోసారి గెలుచుకోవడం గొప్ప విషయమని స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ అన్నారు. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) విస్తారా విస్తారా టాటా సన్స్ , సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఇది 61 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది, ఇందులో 46 ఎయిర్‌బస్ A320neo, 10 ఎయిర్‌బస్ A321, ఒక బోయింగ్ 737-800NG, నాలుగు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఉన్నాయి. -
యప్ టీవీకి రెడ్ హెర్నింగ్ పురస్కారం
హైదరాబాద్: యప్ టీవీ 2015 సంవత్సరానికినూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రెడ్ హెర్రింగ్ టాప్ 100 ఉత్తర అమెరికా పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సంబంధిత రంగాల్లో అభివృద్ధి చెందుతూ..మార్కెట్ లీడర్లుగా ఎదిగే సంస్థలకు ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. ఉత్తర అమెరికాలోని వందలాది సంస్థలతో పోటీపడి వినోదం, మీడియారంగంలో యప్ టీవీ ఈ అవార్డును కైవసం చేసుకుంది. ప్రముఖ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్, ఈబేలు ఇంతకు ముందు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. దక్షిణాసియా కంటెంట్, లైవ్ టీవీ, క్యాచ్ అప్ టీవీ, ఆన్ డిమాండ్ మూవీ సొల్యూషన్స్‌కు సంబంధించి యప్ టీవీ ప్రపంచపు అగ్రగామి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కంటెంట్ ప్లేయర్‌గా యప్ టీవీ ఎదిగింది. జార్జియాలోని అట్లాంట ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. యప్ టీవీ 200కు పైగా టీవీ చానళ్లు, 4500 వీడియోలు, అపరిమిత మూవీలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది. ఈ సందర్భంగా యప్ టీవీ సీఈఓ ఉదయ్‌నందన్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో ప్రముఖ కంపెనీల నడుమ యప్ టీవీని రెడ్ హెర్రింగ్ అవార్డుకు ఎంపిక చేయడం గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. పురస్కారానికి ఎంపిక కావడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, నూతన ఆవిష్కారాలకు ఊతమందించే చోదకంలా ఈ పురస్కారం తమను ఉత్సాహపరుస్తుందని తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement