పట్నా: బిహార్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాజ్యసభ ఎంపీగాను, 2004 ఎన్నికల్లో భాగల్పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2005లో ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుశీల్‌కుమార్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రధాని మోదీ సంతాపం..
సుశీల్ కుమార్ మోదీ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘పార్టీలో విలువైన సహచారుడు, నా స్నేహితుడు సుశీల్ మోదీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. బిహార్‌లో బీజేపీ ఎదుగుదల, విజయానికి సుశీల్ కుమార్ ఘనత వహించారు’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలియజేశారు.
पार्टी में अपने मूल्यवान सहयोगी और दशकों से मेरे मित्र रहे सुशील मोदी जी के असामयिक निधन से अत्यंत दुख हुआ है। बिहार में भाजपा के उत्थान और उसकी सफलताओं के पीछे उनका अमूल्य योगदान रहा है। आपातकाल का पुरजोर विरोध करते हुए, उन्होंने छात्र राजनीति से अपनी एक अलग पहचान बनाई थी। वे… pic.twitter.com/160Bfbt72n
— Narendra Modi (@narendramodi) May 13, 2024
బిహార్ రాజకీయాల్లో గొప్ప మార్గదార్శకుడు: అమిత్ షా
‘రాజకీయాల్లో గొప్ప మార్గదర్శకుడని బిహార్ కోల్పోయింది. ఆయన రాజకీయాలు పేదలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం అంకితం చేశారు. ఆయన మరణంతో బీహార్ రాజకీయాల్లో నెలకొన్న శూన్యతను పూరించలేము’ అని అమిత్ షా ‘ఎక్స్’లో సంతాపం తెలియజేశారు.
हमारे वरिष्ठ नेता सुशील कुमार मोदी जी के निधन की सूचना से आहत हूँ। आज बिहार ने राजनीति के एक महान पुरोधा को हमेशा के लिए खो दिया। ABVP से भाजपा तक सुशील जी ने संगठन व सरकार में कई महत्त्वपूर्ण पदों को सुशोभित किया। उनकी राजनीति गरीबों व पिछड़ों के हितों के लिए समर्पित रही। उनके…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 13, 2024
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుశీల్ కుమార్ మోదీ మృతికి సంతాపం తెలిపారు. ‘గత 51-52 సంవత్సరాలుగా.. పట్నా యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కాలం నుంచి సుశీల్ కుమార్ మోదీ నా స్నేహితుడు. ఆయన మృతి బాధాకరం’అని సంతాపం తెలిపారు.
पटना यूनिवर्सिटी छात्र संघ के समय यानि विगत 51-52 वर्षों से हमारे मित्र भाई सुशील मोदी के निधन का अति दुःखद समाचार प्राप्त हुआ।
वे एक जुझारू, समर्पित सामाजिक राजनीतिक व्यक्ति थे। ईश्वर दिवगंत आत्मा को चिरशांति तथा परिजनों को दुख सहने की शक्ति प्रदान करें।— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 13, 2024
Comments
Please login to add a commentAdd a comment