డీప్‌ఫేక్‌ టెక్నాలజీకోసం ఇంటెల్‌తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ | Sakshi
Sakshi News home page

డీప్‌ఫేక్‌ డిటెక్షన్‌ టెక్నాలజీకోసం ఇంటెల్‌తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ

Published Tue, May 7 2024 3:17 PM

McAfee Deepfake Detector tool will soon be available more languages in the coming months

యూఎస్‌ ఆధారిత సైబర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ అమెరికన్ చిప్ తయరీ సంస్థ ఇంటెల్ సహకారంతో డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీను రూపొందిస్తుంది. మీడియా సంస్థల కథనం ప్రకారం.. మెకాఫీ డీప్‌ఫేక్ డిటెక్టర్ సింథటిక్ కంటెంట్‌ను గుర్తించడానికి  ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌లలోని న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ)ను వాడుకుంటూ ఏఐ అల్గారిథమ్‌లను అమలు చేస్తుంది.

డీప్‌ఫేక్‌ ప్రాసెసింగ్ కోసం వ్యక్తిగత డేటాను క్లౌడ్‌కు పంపాల్సిన అవసరం లేకుండా విశ్లేషణ మొత్తం డివైజ్‌లోనే జరుగుతుందని మెకాఫీ తెలిపింది. ఈ ప్రక్రియ వినియోగదారు గోప్యతకు ప్రధాన్యం ఇస్తుందని చెప్పింది. ఈ టెక్నాలజీ పనితీరును 300 శాతం మెరుగుపరిచేలా కొత్త విధానం ఉపయోగపడుతుందని తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో డీప్‌ఫేక్‌ సంబంధించిన వీడియోలను కనుగొనేందుకు మరిన్ని ల్యాంగ్వేజీలను వినియోగించనున్నట్లు చెప్పింది.

మెకాఫీ డీప్ ఫేక్ డిటెక్టర్‌ ఏఐ ఆధారిత డిటెక్షన్‌ టెక్నిక్‌లను వినియోగిస్తుంది. ఏఐ ట్రాన్స్‌ఫామ్‌ ఆధారిత ‘డీప్ న్యూరల్ నెట్‌వర్క్’ మోడల్‌లతో ఇది పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మెకాఫీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్టీవ్ గ్రోబ్‌మాన్ మాట్లాడుతూ..‘ఇంటెల్‌తో కలిసి పనిచేయడం గొప్పఅనుభవాన్నిస్తుంది. ఏఐ రూపొందించిన డీప్‌ఫేక్‌ల్లో నకిలీ వాటిని గుర్తించేలా కొత్త టెక్నాలజీను వాడుతున్నాం. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ టెక్నాలజీకు చెందిన ఎన్‌పీయూను ఉపయోగిస్తున్నాం. దాంతో వినియోగదారులకు శక్తివంతమైన ఏఐ డీప్‌ఫేక్ డిటెక్షన్ సామర్థ్యాలను అందించనున్నాం’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement