3 Murders In 3 Days In Madhya Pradesh Town, Cops Probe Serial Killer Angle - Sakshi
Sakshi News home page

Madhya Pradesh: 72 గంటల్లో మూడు హత్యలు.. భయాందోళనలో ప్రజలు.. సీరియల్‌ కిల్లర్‌ పనేనా?

Published Thu, Sep 1 2022 3:28 PM

3 Days, 3 Murders In Madhya Pradesh Town Cops Probe Serial Killer Angle - Sakshi

భోపాల్‌: గడిచిన 72 గంటల్లో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు హత్యకు గురయ్యారు. ఈ దారుణాలు మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం సాగర్‌ ప్రాంతంలో వెలుగు చూశాయి. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మూడింటిలో రెండు ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపిన విధానం చూస్తుంటే హంతకుడు సీరియల్‌ కిల్లర్‌గా పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. విచారణ పూర్తి అవ్వకముందే ఎలాంటి స్పష్టతకు రాలేమన్నారు. అంతేగాక పోలీసులు అనుమానిత హంతకుడికి సంబంధించిన స్కెచ్‌ను విడుదల చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కళ్యాణ్ లోధి(50) అనే వ్యక్తిని ఆగస్టు 28 అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో హత్యకు గురయ్యాడు. తలను సుత్తితో పగులగొట్టి అతి కిరాతకంగా చంపేశారు.
చదవండి: కలిచివేసే ఘటన: వైద్యుడి కోసం పడిగాపులు...చివరికి తల్లి ఒడిలోనే ఆ చిన్నారి...


నిందితుడి స్కెచ్‌

ఆగస్టు 29 అర్థరాత్రి రాత్రి.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నరో సెక్యూరిటీ గార్డు శంభు నారాయణ్ దూబే (60)ను కూడా రాయితో తల పగులకొట్టి హత్య చేశారు. ఇక మూడో ఘటనలో, ఆగస్టు 30 రాత్రి సాగర్‌లోని మోతీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్ మంగళ్ అహిర్వార్‌ను కర్రతో దాడి చేసి చంపినట్లు అధికారులు గుర్తించారు.

కాగా ముందు రెండు హత్యలు ఒకే తరహాలో ఉన్నాయని, ‍క్రైమ్‌ జరిగిన క్రమాన్ని చూస్తే  ఒకే వ్యక్తి హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కానీ నిందితులు ఒకరి కంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ కుష్వాహా తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హంతకుడు సైకో లేదా సీరియల్‌ కిల్లర్‌ అయ్యి ఉండొచ్చిన పేర్కొన్నారు.
చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్‌ జెండర్‌ని ఇంటికి రప్పించి...

 
Advertisement
 
Advertisement