మందుపాతరలను పసిగడుతుంది | Sakshi
Sakshi News home page

మందుపాతరలను పసిగడుతుంది

Published Sun, Jan 21 2024 7:00 AM

Korean Students Build Mine Sensing Robot - Sakshi

చూడటానికి పిల్లలు ఆడుకునే కారుబొమ్మలా కనిపిస్తుంది గాని, ఇది మందుపాతరలను పసిగడుతుంది. కొరియన్‌ విద్యార్థులు సుబిన్‌ కిమ్, జిహూన్‌ పార్క్‌ ‘వార్డెన్‌’ పేరుతో ఈ మైన్‌ డిటెక్టింగ్‌ రోబోకు రూపకల్పన చేశారు. ఇది ఎగుడుదిగుడు రహదారులు, బాగా ఎత్తుపల్లాలు ఉండే కొండ దారుల్లో కూడా నిర్దేశించిన మార్గంలో సునాయాసంగా ముందుకు సాగిపోగలదు.

దీని అడుగుభాగంలో మోవింగ్‌ అటాచ్‌మెంట్‌ను అమర్చడంతో దారిలో అడ్డొచ్చే గడ్డి, కలుపు మొక్కలను పీకిపడేస్తూ చకచక ముందుకు కదిలిపోగలదు. పగటి వేళలోనే కాకుండా, రాత్రి కటికచీకట్లోనూ ఇది పనిచేయగలదు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబో మైన్‌డిటెక్టర్‌ మందుపాతరలను అమర్చిన ప్రదేశాలను అత్యంత కచ్చితంగా గుర్తించి, వెనువెంటనే ఆ సమాచారాన్ని యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. కొరియన్‌ విద్యార్థులు ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా రూపొందించారు. మరింత మెరుగుపరచిన తర్వాత దీనిని రక్షణ అవసరాల కోసం అందుబాటులోకి తేనున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement