సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! ఎన్ని ప్రయోజనాలో తెలుసా! | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

Published Thu, Jan 4 2024 2:38 PM

Sonia Gandhi Reveals Her Love For Dal Chawal Benefits Of This Meal - Sakshi

ఇటీవల కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మార్మలాడే(ప్రిజర్వ్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌) అనే రెసిపీ ప్రీపరేషన్‌కి సంబంధించిన వీడియోని షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రాహుల్‌, ఆయన తల్లి సోనియగాంధీ ఆ రెసిపీని ప్రిపేర్‌ చేస్తూ ఇక్కడ భారతీయ వంటకాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ వంటకాల్లో కారానికి అలవాటు పడటానికి తాను ఎలా ఇబ్బంది పడ్డానో వివరించారు. భారతీయ వంటకాల్లో తనకు నచ్చేది 'పప్పు అన్నం' అని ముఖ్యంగా విదేశాలకు వెళ్లి భారత్‌కి రాగనే వెంటనే ఈ వంటకాన్నే తింటానని, అదంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. మన భారతీయులకు పండగలకు, లేదా ఏ సెలబ్రెషన్‌లో అయినా తప్పనిసరిగా ఉండాల్సింది ఈ దాల్‌ రైసే. దీని వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!.. అవేంటంటే..

ఇది చాలా సింపుల్‌ వంటకం. బియ్యం, కాయధాన్యాల కలియక తో కూడిన పప్పు అన్నం ఆరోగ్యాన్ని ఎంతో మంచిది. శాకాహారులు ఎక్కువగా చేసే వంటకం కూడా ఇదే.

ఆరోగ్య ప్రయోజనాలు..

ప్రోటీన్‌ మూలం..
ఈ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులో ఉండే అమైనో ఆమ్లాలు, బియ్యంలోని కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం.. కండరాల నిర్వహణకు, పెరుగుదలకు అవసరమైన అన్ని ప్రోటీన్‌లు సమకూరుస్తుంది. 

ఫైబర్‌..
అలాగే కాయాధాన్యాల్లో ఫైబర్‌ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. సమతుల్య గట్‌ మైక్రోబయోమ్‌ను నిర్వహిస్తుంది. ఈ ఫైబర్‌ కంటెంట్‌ నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి బరువుని అదుపులో ఉంచేలా చేస్తుంది. 

తక్షణ శక్తి..
బియ్యంలో ఉండే కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. రోజంత శరీరంలో శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడానికి పప్పు అన్నం ఒక ఎంపిక. చురుకైన జీవన శైలి లేదా శారీరక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు ఇది మంచి పౌష్టిక ఆహారం. 

సామాన్యుడికి సైతం ..
సామాన్య మానవుడికి సైతం అందుబాటులో ఉండే మంచి ప్రోటీన్లు, ఫైబర్‌తో కూడిన ఆహారం. ఇంట్లో కనీసం కాయగూరలు లేనప్పుడూ దానితో చేసే వివిధ వంటకాలతో   కావాల్సినన్ని పోషకాలు పొందగలుగుతారు.

పోషకాల నిలయం..
పప్పులో ఐరన్‌, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలు అందించగా,  బియ్యంలో ఉండే 'బీ' విటమిన్లు మాంగనీస్‌ను అందిస్తుంది. ఈ పోషకాలు రక్తం ఏర్పడటానికి, రోగనిరోధక వ్యవస్థకు, ఎముకల ఆరోగ్యం తోపాటు వివిధ శారీరక విధులకు మద్దతు ఇస్తుంది. 

కంఫర్ట్ ఫుడ్
అందరూ సులభంగా వండుకునే వంటకం, పైగా భారతీయుల ఇంటిలో తప్పనసరిగా ఉండే వంటకం కూడా ఇదే. ఒకరకంగా ఈ వంటకాన్ని తమ వారసత్వ వంటకంగా చెబుతారు. సామాన్యుడికి విలువైన పోషకాలతో కూడిన ఆహార అవసరాన్ని తీర్చే వంటకం ఇదే. ఆరోగ్యకరమైనది, అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన రెసిపీగా పేర్కొనవచ్చు. 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్‌ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..?)

Advertisement
 
Advertisement
 
Advertisement