రకుల్‌-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్‌ విషెస్‌ వైరల్‌ | Rakul Preet-Jackky Bhagnani Wedding: PM Modi's Letter Goes Viral - Sakshi
Sakshi News home page

రకుల్‌-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్‌ విషెస్‌ వైరల్‌

Published Fri, Feb 23 2024 10:11 AM

Stars Rakul Pree Jackky Bhagnani wedding PM Modi wishses and letter goes viral - Sakshi

PM Modi Wishes to Rakul-Jackky: మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్‌ను స్వయంగా రకుల్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్‌, జాకీ  ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు  తెలిపారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు రకుల్‌-జాకీ జంట. దీంతో కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ చేరడం విశేషంగా నిలిచింది. తన బిజీ షెడ్యూల్‌ కారణంగా మోదీ రకుల్‌-జాకీ పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ నూతన దంపతులకు స్పెషల్‌  ఆశీర్వాదాలు అందించారు.  తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా, పర్యాటక  రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న  భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి  తొలి ప్లాన్‌ను గోవాకు మార్చుకున్నారనే  వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement