సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి పూజలు | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి పూజలు

Published Wed, May 8 2024 8:15 AM

సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి పూజలు

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి, కాళేశ్వరం జ్యూడీషియల్‌ కమిషన్‌ చైర్మన్‌ పినాకి చంద్రఘోష్‌–డెబ్జాని దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం ఆయన ఆలయ రాజగోపురం వద్దకు రాగా ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. వారికి అర్చకులు స్వామివారి ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం శ్రీశుభానందదేవి(పార్వతీ) అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ పీసీ ఘోష్‌ దంపతులను ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణౖమూర్తిశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని దంపతులకు బహూకరించారు. ఆయనతో పాటు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు వేర్వేరుగా సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట దేవస్థానం సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఇరిగేషన్‌శాఖ ఈఎన్‌సీలు అనిల్‌కుమార్‌, ఓఅండ్‌ఎం ఈఎన్‌సీ నాగేందరావు, సీఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ తిరుపతిరావు, డీఈ, ఏఈలు ప్రకాశ్‌, పవన్‌, కిరణ్‌, భరత్‌, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రాజేశ్వరావు, ఎస్సై భవానిసేన్‌ ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement