Kalki 2898 AD Update: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ | Prabhas Kalki 2898 AD Movie Official Release Date Announced, Promotions Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Prabhas Kalki 2898 AD Release Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

Published Fri, Jan 12 2024 11:47 AM

Kalki 2898 AD Official Release Date Announced - Sakshi

సంక్రాంతి సందర్భంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. 'కల్కి 2989 ఏడీ' విడుదలపై క్లారిటీ వచ్చేసింది. గతేడాది సలార్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ప్రభాస్‌ ఈ ఏడాది కూడా దూకుడు పెంచనున్నాడు. ఇప్పటికే పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మన డార్లింగ్‌ కల్కి చిత్రంతో పాన్‌ వరల్డ్‌కు రీచ్‌ కావడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు.

నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్న కల్కి చిత్రాన్ని మే 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కల్కి రిలీజ్‌ డేట్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చిత్ర యూనిట్‌ ఘనంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా కల్కి టీజర్‌ను కూడా విడుదల చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. సుమారు 83 సెకన్ల పాటు టీజర్‌ను కట్‌ చేశారని సమాచారం.

వైజయంతి బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మే 9 అంటే వైజయంతి మూవీస్‌కు మంచి సెంట్‌మెంట్‌ ఉంది. అదేరోజు అంటే 9 మే 1990లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం వచ్చింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా అప్పట్లో రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను వైజయంతి మూవీస్‌ ఫాలో అతుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement