TV Actor Ram Kapoor Buys An Expensive Luxury Sports Car: Check Details - Sakshi
Sakshi News home page

Porsche: 1.83 కోట్ల విలువైన కారు కొన్న బుల్లితెర నటుడు

Published Tue, Jul 13 2021 1:25 PM

TV Actor Ram Kapoor Buys Expensive New Porsche 911 Carrera S - Sakshi

Ram Kapoor New Car: ప్రముఖ బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. సుమారు 1.82 కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన పోర్షే 911 కరీరా ఎస్‌ మోడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. సెంట్రల్‌ ముంబైలోని రామ్‌ కపూర్‌ నివాసానికి కారును పంపించామని, పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేసింది. 

ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అసలే వర్షాలు.. ముంబై రోడ్ల మీద ఈ కారు సాఫీగా సాగిపోతుందా? అయినా.. మన టీవీ ఆర్టిస్టులకు ఇంత పెద్ద మొత్తం పారితోషికంగా లభించడం నిజంగా పెద్ద విషయమే. అంతా ఏక్తా కపూర్‌ మహిమ’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా న్యాయ్‌ సీరియల్‌తో 1997లో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టిన రామ్‌ కపూర్‌... హీనా, సంఘర్ష్‌, కవిత వంటి డ్రామాలతో గుర్తింపు దక్కించుకున్నాడు. 

ఇక హిందీ టెలివిజన్‌ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఏక్తా కపూర్‌ నిర్మించిన ఘర్‌ ఏక్‌ మందిర్‌తో అతడి కెరీర్‌ మలుపు తిరిగింది. ముఖ్యంగా కసం సే, బడే అచ్చే లగ్‌తే హై సీరియల్‌తో పెద్ద బ్రేక్‌ వచ్చింది. తన నటనకు గానూ పలు అవార్డులు కూడా పొందాడు. ఇక ఏజెంట్‌ వినోద్‌, స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌, హమ్‌షకల్స్‌, ఉడాన్‌, థప్పడ్‌ వంటి సినిమాల్లో రామ్‌ కపూర్‌ నటించాడు. 

కారు ధర, ముఖ్యమైన ఫీచర్లు:
పోర్షే 911 కరీరా ఎస్‌ ధర- సుమారు 1.83 కోట్లు
మైలేజ్‌- 11.24 కిలోమీటర్‌/లీటర్‌
ఇంజన్‌- 2981సీసీ
ఆటోమేటిక్‌ డ్యుయల్‌ క్లచ్‌
పెట్రోల్‌ వర్షన్‌
4 సీటర్‌ కెపాసిటీ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement