నేడు కేటీఆర్‌ రోడ్‌షో | Sakshi
Sakshi News home page

నేడు కేటీఆర్‌ రోడ్‌షో

Published Wed, May 8 2024 3:40 AM

నేడు

అచ్చంపేట రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్ధతుగా సాయంత్రం 4 గంటలకు కేటీఆర్‌ రోడ్‌షో ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మండలంలోని నడింపల్లిలో ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులు ధ్వంసమైన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. కాగా, గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రచారాలకు వెళ్తే దాడులకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహాగౌడ్‌, అమీనుద్దీన్‌, రవీందర్‌రావు, శంకర్‌, కుత్బుద్దీన్‌ ఉన్నారు.

విధి నిర్వహణలోఅప్రమత్తంగా ఉండాలి

ఉప్పునుంతల: విధి నిర్వహణలో వైద్యసిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్‌) డా.ఉమేష్‌ చంద్ర సూచించారు. మంగళవారం ఉప్పునుంతల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వచ్చేనెల మొదటి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించడానికి కావాల్సిన పరికరాలు, ఇతర వసతులను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని చెప్పారు. సీహెచ్‌సీలో సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియామకానికి సంబంధించి కమిషనర్‌కు నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. ఈఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నందున ఆస్పత్రిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు రమాకాంత్‌, శివలీల, ఫార్మసిస్టు శ్రీనివాసులు, స్టాఫ్‌ నర్సులు ఉఫత్‌, వెంకటమ్మ, సిబ్బంది నజీర్‌ ఉన్నారు.

‘ఇండియా కూటమిదే విజయం’

కొల్లాపూర్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా కూట మి విజయం ఖాయమని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సీపీఐ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా.. మంత్రి జూపల్లితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ్మ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కార్‌ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు లోపాయికారి ఒప్పందంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి ప్రజాసమస్యలు తెలిసిన వ్యక్తి అని.. ఆయనను గెలిపించుకుంటే ఇక్కడి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తారన్నారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకుందామని సీపీఐ నాయకులను కోరారు. కాగా.. కేంద్ర, రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు పార్టీ శ్రేణులు పనిచేయాలని సీపీఐ నాయకులు బాల్‌నర్సింహ్మ, ఫయాజ్‌ సూచించారు. సమావేశంలో ఏసయ్య, కిరణ్‌కుమార్‌, ఇందిరమ్మ, వెంకటస్వామి, యూసూఫ్‌, శ్రీనివాసులు ఉన్నారు.

నేడు కేటీఆర్‌ రోడ్‌షో
1/1

నేడు కేటీఆర్‌ రోడ్‌షో

Advertisement
Advertisement