సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను టీఆర్‌ఎస్ నేతలు కలిశారు. కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను మార్చాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌పై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారిని కలిసినవారిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఉన్నారు.
చదవండి: చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే..
కాగా, కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనకు ఉన్న సమాచారం మేరకు తాంత్రికుడు చెప్పడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు కాలం ముగిసిందని, ఆ పేరుతో వెళ్తే తలకిందులేసి తపస్సు చేసినా పార్టీ గెలవదని తాంత్రికుడు చెప్పాడని, అందుకే తాంత్రికుల సూచనతో బీఆర్‌ఎస్‌గా పేరు మార్చారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌కు జెండా లేదు.. ఎజెండా లేదు. దేశాన్ని ఉద్ధరించడానికి బీఆర్‌ఎస్ పెట్టలేదని.. కేవలం దెయ్యాలు, రాక్షస పూజలు చేస్తున్నాడు కాబట్టే వారి మాటలు విని పార్టీ పేరు మార్చాడని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment