స్తంభించిన ట్రాఫిక్‌ | Sakshi
Sakshi News home page

స్తంభించిన ట్రాఫిక్‌

Published Tue, Apr 23 2024 8:30 AM

-

కొరుక్కుపేట: తిరుచ్చి–చైన్నె జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈనెల 19వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు చైన్నెలో నివసిస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు వెళ్లారు. ప్రభుత్వ బస్సుల ద్వారానే 4.55 లక్షల మంది స్వగ్రామాలకు వెళ్లారు. ఈ క్రమంలో వారు సెలవు ముగించుకుని చైన్నెకి తిరిగి వస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తిరుచ్చి–చైన్నె జాతీయ రహదారిపై అచ్చరప్ప గ్రామ సమీపంలోని అత్తూరు టోల్‌బూత్‌ వద్ద ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు నిరంతరాయంగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులు తీరాయి. ఆత్తూరులోని అచ్చరప్పక్కం టోల్‌ బూత్‌ వద్ద ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సరిపడా పోలీసులు లేకపోవడంతో పాటు కౌంటర్లు కూడా తెరవకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అలాగే, చెంగల్‌పట్టులోని పరనూర్‌ టోల్‌రోడ్డు, సింగపెరుమాళ్‌ దేవాలయం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. తిరుచ్చి , మదురై నుంచి ప్రత్యేక రైళ్లలో కాటంగోలత్తూరు, తాంబరంలో దిగే ప్రయాణికులు అక్కడి నుంచి బస్సుల్లో చైన్నెలోని వారి నివాసాలకు వెళ్లడానికి వేచి ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది.

Advertisement
Advertisement