మా గుండెల్లో కొలిచేనేత ఆయన | Sakshi
Sakshi News home page

మా గుండెల్లో కొలిచేనేత ఆయన

Published Wed, May 8 2024 4:35 AM

మా గు

గతమెంతో ‘హీనం’

క్కడ మగ్గం దగ్గర కనిపిస్తున్న పెద్దావిడ పేరు ఆశపు భ్రమరాంబ. చిన్నప్పటి నుంచి నేత చేసుకోవడం పదీ.. పరకా సంపాదించుకోవడం ఒకటే తెలుసు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం వీవర్స్‌కాలనీకి చెందిన సూర్యచంద్రరావుతో పెళ్లయింది. భర్త కూడా నేత కార్మికుడే. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలసి వీవర్స్‌కాలనీలో మగ్గంపైనే కష్టపడుతూ జీవనం సాగించేది. వీరి కుమారుడు నాగరాజు, కోడలు శాంతకుమారి కూడా నేత కార్మికులే. అయితే చేనేత ప్రాభవం బాగా ఉన్న రోజుల్లో వీరికి పెద్దగా ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండేవి కాదు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి జీవనం మరీ దుర్భరంగా మారింది. నేత కార్మికులకు, మగ్గందారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం, ఆరుగాలం మగ్గంపై శ్రమించినా సరైన ఆదాయం లేకపోవడంతో కొన్ని నెలలు మగ్గం మూసేసి వేరే పనులు కూడా చేసుకున్నారు. ఈ బతుకు ఎందుకూ అనిపించేది.

2019 తర్వాత బతుకుపై ‘ఆశపు’ట్టే

2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేతదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు భ్రమరాంబ కుటుంబానికి కలిసి వచ్చాయి. సంక్షేమ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలు నవ్వులు పంచాయి. దీంతో మూలన పడిన మగ్గం మళ్లీ పరిగెత్తడం ప్రారంభించింది. ఆ ఇంట్లో మగ్గాల సంఖ్య రెండుకు చేరాయి. ప్రస్తుతం భ్రమరాంబ ఆమె భర్తతోపాటు కొడుకు నాగరాజు, కోడలు శాంతికుమారి అంతా మగ్గాలపై చీరలు నేస్తున్నారు. 5 దఫాలుగా ఆ కుటుంబానికి వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా రూ.2.40 లక్షలు వచ్చాయి. భ్రమరాంబ భర్త చంద్రరావుకు వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. కోడలు శాంతకుమారికి వైఎస్సార్‌ చేయూత పథకంలో ఏడాదికి రూ.18,750 చొప్పున రూ.56,250 వచ్చింది. నాగరాజు శాంతకుమారి దంపతులకు 5వ తరగతి, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరికి అమ్మఒడి పథకంలో ఈ 5 ఏళ్లలో రూ.80 వేలు జమయ్యాయి. ఇక భ్రమరాంబతో పాటు కోడలు శాంతకుమారి ఇద్దరికి కూడా పట్టణంలో జగనన్న కాలనీలో ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఈ రెండు స్థలాలు కలిపి రూ.15–17 లక్షలు విలువ చేస్తాయి. ఇలా ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నుంచి పథకాల రూపంలో వచ్చిన సహాయం మొత్తం సమారు రూ.20 లక్షలకు చేరింది. దీంతో ఆ కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇదంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యం వల్లే సాధ్యమైందని, మేం నిత్యం కొలిచే నేత ఆయన అని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.

– నరసాపురం

నవ్వులు పంచిన నవరత్నాలు

ఒకప్పుడు భారంగా జీవనం

ఆశపు ఇంట సంతోషాల సిరులు

మా గుండెల్లో కొలిచేనేత ఆయన
1/1

మా గుండెల్లో కొలిచేనేత ఆయన

Advertisement

తప్పక చదవండి

Advertisement