సాక్షి ప్రతినిధి కడప: టీడీపీ నేత రాజ్యసభ సభ్యులు ఎంపీ సీఎం రమేష్ నివాసం గృహం, సమీప బంధువులు, ప్రధాన అనుచరుల ఇళ్లల్లో శుక్రవారం ఐటీ అధికారులు సో దాలు చేశారు. ఈవార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదా యపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేసి మూడు సూట్‌కేసులల్లో విలువైన పత్రాలు, డ్యాకుమెంట్లు తీసుకెళ్లారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంటిలో శుక్రవారం తిరుపతి నుంచి వచ్చిన 8 మంది ఐటీ (ఇన్‌కం ట్యాక్స్) అధికారులు తనిఖీలు చేశారు.
సాయంత్రం 5.30 గంటల వరకూ అధికారుల తనిఖీలు కొనసాగాయి. కాగా ‘గుమ్మడి కాయల దొంగ’ అంటే భుజాలు తడుముకున్నట్లుగా టీడీపీ నేతలు శైలి కన్పించింది. ఐటీ అధికారుల తనిఖీలు చేయడాన్ని రాజకీయ రంగు పులిమి నిరసనలు, నినాదాలు చేపట్టారు. ఓవైపు అధికారులు వారి పని వారుచేస్తుండగా మరోవైపు టీడీపీ శ్రేణులు ఆం దోళనలు కొనసాగించాయి. ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, బీటెక్ రవీ, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోట్లదుర్తి చేరుకొని హంగామా సృష్టించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన పాటించారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మీడియా ఎదుట ఆగ్రహం ప్రదర్శించారు.
రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్....
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ రమేష్‌నాయుడు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్‌కు వేల కోట్లు కాంట్రాక్టు పనులు వచ్చి చేరిపోయాయి. అప్పటి వరకు అరకొర పనులకే పరిమితమైన ఆ సంస్థ రాష్ట్రంలో దాదాపుగా రూ.3,658కోట్లు పనులు చేసినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు కల్పతరువుగా నిలిచాయి. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ఆర్టీపీపీ, వంశధార, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ టన్నెల్ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం.
బీఎన్‌ఎస్‌ఎస్‌లో అతి తక్కువగా నిలిచిపోయిన పనులు రివైజ్డ్ రేట్లు వేయించుకొని అత్యధికంగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ 34వ ఫ్యాకేజీ రూ.234కోట్లు, జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టులో రూ.350కోట్లు, వెలిగొండ టన్నల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ఫ్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్లు పనులు దక్కినట్లు కాంట్రాక్టు వర్గాలు వివరిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్లు పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు ధ్రువీకరిస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంలో ఆదాయ వ్యవహారాలు చెల్లించడంలో లోటుపాట్లు ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించి దాడులకు పాల్పడినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఇదివరకే టీడీపీ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజలరెడ్డి సైతం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు సైతం చేశారు. ఈనేపథ్యంలో ఐటీ విభాగం ప్రత్యక్ష తనిఖీలు చేయడంపై పోట్లదుర్తి వాసులు ‘తేలు కుట్టిన దొంగల్లా’ వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment