నంద్యాల ఉప ఎన్నిక అప్‌ డేట్స్‌... | Nandyal By Election Live Updates | Sakshi
Sakshi News home page

నంద్యాల ఉప ఎన్నిక అప్‌ డేట్స్‌...

Published Wed, Aug 23 2017 8:02 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

నంద్యాల ఉప ఎన్నిక అప్‌ డేట్స్‌... - Sakshi

నంద్యాల ఉప ఎన్నిక అప్‌ డేట్స్‌...

సాక్షి, నంద్యాల : ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో నంద్యాల ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 255 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

కురుక్షేత్రం ముగిసింది: నంద్యాల ఉప ఎన్నికను కురుక్షేత్ర మహా సంగ్రామంగా శిల్పా చక్రపాణిరెడ్డి అభివరణించారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారని, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు.

నూటికి నూరు శాతం గెలుపు వైఎస్సార్‌సీపీదే: టీడీపీకి నంద్యాల ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారని, నూటికి నూరుశాతం గెలిచేది వైఎస్సార్‌సీపీనే అని ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

82 శాతానికి పెరగనున్న ఓటింగ్‌: నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని, రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదవుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ చెప్పారు.

♦  సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసింది. ఈ సమయంలోగా పోలింగ్‌ కేంద్రంలో వరుసలో నిలుచుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రకటించింది.

నంద్యాలలో సాయంత్రం 5 గంటల వరకు 76 శాతంపైగా పోలింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఆయన ప్రకటించారు. కొత్తగా ప్రవేశపెట్టిన వీవీ పాట్స్‌ బాగా పనిచేశాయన్నారు.

రహీంపై దాడి: వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేత రహీంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. నంద్యాలలోని ఫారూఖ్‌ నగర్‌లో రహీంపై దాడి చేసిన దృశ్యాలు సంచలనం రేపాయి.

ఫరూఖ్‌ నగర్‌లో ఘర్షణ: మైనారిటీలే లక్ష్యంగా టీడీపీ దాడులకు తెగబడింది. నంద్యాలలోని ఫరూఖ్‌ నగర్‌ ఏరియాలో వైఎస్సార్‌సీపీ నేత రహీం, మరికొద్ది మందిపై టీడీపీ నేతలు దాడికి దిగడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది.

అబ్దుల్‌ కలాంపై భౌతికదాడి: నంద్యాల ఏడోవార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అబ్దుల్‌ కలాంపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి భౌతికదాడి చేశారు.

గాంధీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత: నంద్యాలలోని గాంధీనగర్‌లో డబ్బులు పంచుతోన్న టీడీపీ నేత అన్న రాంబాబు అనుచరులు.. అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. టీడీపీ గుండాల దాడి.. తోపులాటతో భయాందోళనకు గురైన ఓటర్లు. చోద్యం చూస్తూ నిలబడిన పోలీసులు.

రికార్డ్‌ పోలింగ్‌ శాతం దిశగా: నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 71.91 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నంద్యాల గ్రామీణంలో 81.10 శాతం, నంద్యాల అర్బన్‌లో 67.60 శాతం, గోస్పాడు మండలంలో 81.14 శాతం ఓటింగ్‌ నమోదయినట్లు ఈసీ పేర్కొంది.

మధ్యాహ్నం 3 గంటల వరకు... ఒక లక్షా 57 వేల 401 ఓట్లు పోలయ్యాయని, వారిలో మహిళలు 81వేల 492 మందికాగా, పురుషులు 75 వేల 910 మంది అని ఈసీ తెలిపింది. 2014 సాధారణ ఎన్నికల్లో నంద్యాలలో పోలింగ్‌ శాతం 72.14కాగా, నేటి ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ శాతం నాటి రికార్డుకు చేరువైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో ఓటింగ్‌ శాతం రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది.


పోలింగ్‌ బూత్‌ వద్ద దౌర్జన్యం: నంద్యాల 29వ వార్డు, పోలింగ్‌ బూత్‌ నంబర్‌162 వద్ద టీడీపీ కార్యక్తలు దౌర్జన్యానికి పాల్పడుతుండటంతో అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యర్తలు. టీడీపీ నేతలకు అనుకూలంగా ప్రవర్తించిన త్రీటౌన్‌ సీఐ దేవంద్ర.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వెళ్లగొట్టే యత్నం.

చిక్కిన టీడీపీ దొంగ ఓటర్లు: ఉదయం నుంచి కొనసాగుతున్న టీడీపీ అక్రమపర్వం పరాకాష్టకు చేరింది. ఏకంగా భారీ సంఖ్యలో దొంగ ఓటర్లను రంగంలోకి దించింది. నంద్యాలలోని నందమూరి నగర్‌లో 10 మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. విచారణ కోసం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 10 మంది దొరికిపోవడంతో మరో 20 మంది ఓటర్లు పోలింగ్‌ స్టేషన్‌ నుంచి పారిపోయారు.

నంద్యాల రూరల్‌ మండల్లాల్లో భారీగా పోలింగ్‌: మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. చాపిరేవులలో 2750 ఓట్లకుగానూ ఇప్పటివకర 2100 ఓట్లు పోలయ్యాయి. మిట్నాలలో 1500కుగానూ 860, భామవరంలో 1800కుగానూ 1000, గుంతనాలలో 700కుగానూ 600, బ్రాహ్మణపల్లిలో 560 ఓట్లకుగానూ 460 ఓట్లు పోలయ్యాయి.

మధ్యాహ్నం 1గంట వరకూ 53.1 శాతం పోలింగ్‌ నమోదు
ఒంటి గంట వరకూ పోలైన ఓట్లు లక్షా 16వేల 214
పోలైన ఓట్లలో మహిళలు 59,954, పురుషులు 56,260

నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ నేతలు
వార్డుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్న మంత్రి అఖిలప్రియ

నంద్యాల మండలం ఒంటిగంట వరకూ రూరల్‌లో భారీగా పోలింగ్‌
చాపరేవులలో 2750కి 2100 ఓట్లు పోల్‌
మిట్నాలలో 1500కి 860, భీమవరంలో 1800కి 1000 ఓట్లు పోల్‌
గుంతనాలలో 700కి 600..బ్రాహ్మణపల్లిలో 560కి 460 ఓట్లు పోల్‌

రికార్డు స్థాయి పోలింగ్‌ దిశగా దూసుకెళ్తున్న నంద్యాల
పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్న శిల్పా మోహన్‌ రెడ్డి
ప్రశాంతంగా ఎన్నిక జరగడానికి అందరూ సహకరించాలి
ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించండి

పోలీస్‌ ఉన్నతాధికారితో ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి మంతనాలు
గోస్పాడు మండలం యళ్లూరులోని ఓ ఆలయంలో భేటీ

గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్‌
చాపరేవులలో మధ్యాహ్నం 12 గంటల వరకూ 75 శాతం పోలింగ్‌ నమోదు
2,750 ఓట్లకుగాను పోలైన 2,050 ఓట్లు

నంద్యాల 74,76 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
అడ్డుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, వాగ్వాదం
గోస్పాడు మండలం పార్వతీపురంలో ఈవీఎం మొరాయింపు

స్థానికేతరులు జిల్లాలో ఉండొద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోని వైనం
యథేచ్చగా ఓటర్లపై ఒత్తిడులు, ప్రలోభాలు
అధికార పార్టీ ప్రలోభాలపై నిస్తేజంగా పోలీసు యంత్రాంగం
ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందంటున్న వైఎస్‌ఆర్‌సీపీ
ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు
తక్షణమూ టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

యళ్లూరులో తిరుగుతున్న బనగానపల్లె ఎమ్మెల్యే జనార్ధన్‌ రెడ్డి
ఎమ్మెల్యే స్టిక్కర్‌ఉన్న ఫార్ఛునర్‌ కారులో సంచారం
ఎస్‌బీఐ కాలనీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం
నిబంధనల ప్రకారం కర్నూలు జిల్లాలో స్థానికేతరులు ఉండరాదు

టీడీపీ కౌన్సిలర్‌ భర్త ప్రసాద్‌ హల్‌చల్‌
27వ వార్డులో కౌన్సిలర్‌ హారిక, ప్రసాద్‌ అధికార దుర్వినియోగం

అధికార పార్టీ బెదిరింపులకు భయపడొద్దని రవిచంద్ర కిషోర్‌ రెడ్డి సూచన
అందరూ ఓటువేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి
మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

మిట్నాలలో భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్‌ రెడ్డి హల్‌చల్‌
నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన విఖ్యాత్‌

నంద్యాల ఎస్‌బీఐ కాలనీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం
ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

ఉదయం 11 గంటల వరకూ 32.4 శాతం పోలింగ్‌ నమోదు
ఓటు హక్కు వినియోగించుకున్న 70,909 ఓటర్లు
ఓటు వేసిన 36,305 మంది పురుషులు, మహిళలు 34,604

చాబోలులో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎమ్మెల్యే

నంద్యాలలో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం
పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ క్యూలు
క్యూలైన్‌లో పెద్ద ఎత్తున బారులు తీరిన మహిళలు
ప్రలోభాలకు లొంగకుండా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు
పలు గ్రామాల్లో ఇప్పటికే 40శాతం దాటిన పోలింగ్‌
నంద్యాల పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాల్లోనూ భారీగా ఓటింగ్‌

వైఎస్‌ఆర్‌ సీపీకి గట్టి పట్టున్న వైఎస్‌ఆర్‌ నగర్‌లో టీడీపీ నేతల స్వైర విహారం
టీడీపీ అభ్యర్థి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, ఎస్వీ మోహన్‌ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి హల్‌చల్‌
ఎటువంటి పాస్‌లు లేకుండానే ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్న నేతలు

కొనసాగుతున్న అధికార పార్టీ ప్రలోభాల పర్వం
ఎన్టీఆర్‌ షాదీఖానా వద్ద కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి మకాం
12వ వార్డులోని ఓ ఇంట్లో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, మణిగాంధీ
144 సెక్షన్‌ అమల్లో ఉన్నా ఖాతరు చేయని టీడీపీ నేతలు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యేలు
నంద్యాలకు ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌, పార్టీ నేత చమన్‌
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విస్తృత ప్రయత్నాలు

నందమూరి నగర్‌లో భూమా మౌనిక ప్రచారం
మౌనికతో పాటు ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేతల ప్రచారం
పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు

నంద్యాల నందమూరి నగర్‌లో కేంద్ర బలగాల పహారా
టీడీపీ కౌన్సిలర్‌ శివశంకర్‌ డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు

ఏపీ సచివాలయంలోనూ అధికార దుర్వినియోగం
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ
ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారులకు మంత్రుల ఆదేశాలు

నంద్యాలలోకి ప్రవేశించిన ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌ రెడ్డి, మణిగాంధీ
నంద్యాల 94,97 పోలింగ్‌ కేంద్రాలలో ఈవీఎంల మొరాయింపు

మెజార్టీ పోలింగ్‌ బూత్‌లలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు అనుమతి
వైఎస్‌ఆర్‌ సీపీ ఏజెంట్లకు పాస్‌లు ఇవ్వకుండా వేధిస్తున్న అధికారులు
10వ వార్డు శారదా విద్యాపీఠం వద్ద సర్వే పేరిట ఓటర్లకు బెదిరింపులు

ఉదయం 9 గంటల వరకూ 17 శాతం పోలింగ్‌ నమోదు
ఓటు హక్కు వినియోగించుకున్న 37,236 మంది ఓటర్లు
ఓటు వేసిన మహిళలు (18,245) పురుషులు (18,991)

నంద్యాలలో మంత్రి ఆదినారాయణరెడ్డి అత్యుత్సాహం
గోస్పాడు మండలం దీబగుంటలోవైఎస్‌ఆర్‌ సీపీ నేత పీపీ నాగిరెడ్డి బంధువులను అరెస్ట్‌ చేయాలని ఒత్తిడి
నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసిన అధికారులు

నంద్యాలలోని 84, 85, 86 బూత్‌లలో టీడీపీ రిలీవింగ్‌ ఏజెంట్ల హల్‌చల్‌
వైఎస్‌ఆర్‌ సీపీ ఏజెంట్లను బయటకు పంపి ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ

ఈ ఉప ఎన్నికలో  టీడీపీ, వైఎస్‌ఆర్‌ సీపీ, కాంగ్రెస్‌తో పాటు మొత్తం 15 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం  2 లక్షల 18 వేల 858 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు. సుమారు 20మంది అనుచరులతో కలిసి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. మరోవైపు బ్రహ్మానందరెడ్డి సోదరి ఏకంగా పోలింగ్‌ బూత్‌లోనే ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీకే ఓటు వేయాలని బ్రహ్మానందరెడ్డి సోదరి నాగ మౌనిక ఆదేశాలు ఇచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement