హైదరాబాద్ : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ గ్రూప్-డి పరీక్ష సందర్భంగా జరిగిన హైటెక్ కాపీయింగ్ సంఘటనపై రైల్వేశాఖ స్పందించింది. పరీక్షను రద్దు చేయడం కుదరదని, మాస్ కాపీయింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని రైల్వే సీపీఆర్వో సాంబశివరావు సోమవారమిక్కడ తెలిపారు. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యలపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఆర్ఆర్సీ పరీక్ష మాస్ కాపీయింగ్కు సంబంధించి ప్రధాన సూత్రధారి మచ్చేందర్, మరొక రైల్వే ఉద్యోగి కోసం ప్రత్యేక బృందం..గాలిస్తోంది. నాందేడ్‌లో కూడా ఇలాంటి హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పరీక్షను రద్దు చేయడం కుదరదు: రైల్వేశాఖ
Published Mon, Dec 1 2014 2:21 PM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM
Advertisement