వైఎస్‌ఆర్ అంటేనే ఓ ప్రేమ మత్తు..
గుంటూరు: తనకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పరిచయం చేసుకునే కన్నా... వైఎస్‌ఆర్ అభిమానిని అని చెప్పుకోవడమే గర్వంగా ఉంటుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ అనే పదం హృదయం అంచుల నుంచి బయటకు వస్తుంటే ప్రేమ మత్తు కలుగుతుందన్నారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు వచ్చినప్పుడు ఆయన పంచెకట్టును సవరించుకుంటూ నడుస్తూ ఉన్న దృశ్యం ఈనాటికి మర్చిలేనిదన్నారు. అంత గొప్ప నాయకుడిని చూసిన కళ్లతో నక్కలాంటి ముఖ్యమంత్రిని చూడాలంటే బాధ అవుతోందన్నారు.
తమ పార్టీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధంపు హామీలతో అధికారంలోకి వచ్చారని చెబుతున్నారని... అయితే చంద్రబాబు నిజం చెబితే విచిత్రం...అబద్ధం చెప్తే వింతేమీ లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనకు ఓ సామెత గుర్తుకు వస్తోందని సిద్ధయ్య కంటే గొప్ప శిష్యుడు.. బ్రహ్మంగారింతటి గురువు.. వేమన్న అంతటి గొప్ప కవి లేరన్నట్లుగా... చంద్రబాబు అంతటి అబద్ధాల కోరు లేరని రాచమల్లు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న అందరం కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ప్రతి గ్రామాన్ని మాఫియాగా మార్చారు..
గతంలో మాఫియా అంటే ముంబాయి గుర్తొచ్చేదని, అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలోనూ టీడీపీ మాఫియాను తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మట్టి నుంచి ఇసుక వరకు అంతా దోచుకుంటూ ముఠా రాజకీయాలు చేస్తున్నారని, జన్మభూమి కమిటాలు గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నాయని, పోలవరం ప్రాజెక్ట్ నుంచి రాజధాని వరకు అంతా అవినీతే అని అన్నారు. అందరం పోరాడి పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామన్నారు.
చంద్రబాబు కార్మిక ద్రోహి
చంద్రబాబు కార్మిక ద్రోహి అని వైఎస్‌ఆర్ సీపీ ట్రెడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. ప్లీనరీలో కార్మిక సమస్యలపై పలు తీర్మానాలను గౌతంరెడ్డి ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమోదం తెలిపారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వాళ్ల మజ్జిగను అమ్ముకోవడానికి తమ పొట్ట గొడుతున్నారన్నారు. నష్టాల్లో ఉందంటూ ఆర్టీసీని ప్రవేట్ పరం చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు.
ఎల్లో మీడియ వాస్తవాలు గ్రహించాలి
రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని, ఎల్లో మీడియా వాస్తవాలు గ్రహించాలని ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అన్నారు. ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పూర్తిగా అవినీతి పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 600 హామీలు ఇచ్చారని, ఆ హామీలు విస్మరించారన్నారు. ఇలాంటి నాయకుడు దేశంలోనే ఉండరన్నారు.
ప్రజా సమస్యలతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైఎస్ జగన్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే..ఎల్లో మీడియా, టీడీపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, అనేక ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు ప్రచురించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుందామని కొరుముట్ల శ్రీనివాసులు కోరారు.
చదవండి:
నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్ విజయమ్మ
మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్ షర్మిల
'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి'
ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్ జగన్
ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు
'ప్రతి ఇంటికి పెద్ద కొడుకు వైఎస్ జగన్'