ముంబై: మొండిబకాయిల పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ త్వరలోనే నివేదిక అందించనుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్‌బ్యాంకు ఏర్పాటుకు సూచనలను తెలియజేసేందుకు గాను పీఎన్‌బీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో రజనీష్ కుమార్‌తోపాటు బ్యాంకు ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ సభ్యులుగా ఉన్నారు.
ఈ ఏడాది జూన్ 8న ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. ఎన్‌పీఏ సత్వర పరిష్కారానికి గాను బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై కమిటీ సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటిపోయింది. అయితే, 99 శాతం పని పూర్తయింది. దీనికి ముగింపు ఇచ్చి త్వరలోనే ఆర్థిక శాఖకు నివేదిక అందజేస్తాం’’ అని రజనీష్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment