తలసానిని కలసిన వేణుమాధవ్ | venu madhav meeting with talasani srinivas yadav | Sakshi
Sakshi News home page

తలసానిని కలసిన వేణుమాధవ్

Published Thu, May 12 2016 12:22 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తలసానిని కలసిన వేణుమాధవ్ - Sakshi

తలసానిని కలసిన వేణుమాధవ్

హైదరాబాద్ : తాను చనిపోయినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్కు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ను వేణుమాధవ్ కలిశారు.

తాను మరణించానంటూ ఓ టెలివిజన్ చానెల్‌తోపాటు పలు వెబ్‌సైట్లలో వచ్చిన వార్తలను ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఖండించిన సంగతి తెలిసిందే. మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో వేణుమాధవ్ తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో వేణుమాధవ్ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు చానెల్, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వెబ్‌సెట్లలో వేణుమాధవ్ మృతి చెందిన్నట్లు వచ్చిన వార్తలు వెలువడటం సినీ పరిశ్రమ వర్గాలను, అభిమానులను ఆందోళన గురిచేశాయి.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. గతవారం తన అభిమాన నటులు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement