‘సామాను’ పోయింది బాబోయ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం మత్తులో విలువైన వస్తువులు పోగొట్టుకోవడం సహజం, అయితే ఇతను ఏకంగా తన ‘సామాను’నే పోగొట్టుకుని లబోదిబో మంటున్నాడు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీప గ్రామానికి చెందిన మురుగేశన్ (57)ను భార్య వదిలివెళ్లిపోవడంతో బెంగళూరులో కూలీపనిచేస్తూ అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చివెళుతుంటాడు. గ్రామానికి చేరుకున్నపుడల్లా పూటుగా మద్యం తాగడం ఇతనికి అలవాటు.
వారం క్రితం గ్రామానికి వచ్చిన మురుగేశన్ యథాప్రకారం మద్యంలో మునిగితేలాడు. కాలినడకన గ్రామానికి వెళుతూ మద్యం మత్తు ఎక్కువై అచేతనంగా పడిపోయాడు. కొద్దిసేపటికి బిగ్గరగా కేకలు వేస్తూ లేచికూర్చున్నాడు. అతని అరుపులకు భయపడిన చుట్టుపక్కల వారు వచ్చి విచారించగా, తన ‘సామాను’(మర్మాంగం) కనపడటం లేదని లబోదిబోమన్నాడు. ప్రజలు పరికించి చూడగా సమీపంలో ఒక కుక్కను గుర్తించారు. మైకంలో ఉన్నపుడు ఆ కుక్కే దాన్ని కొరికి తినివేసి ఉండవచ్చని స్థానికులు మురుగేశన్‌ను ఆసుపత్రిలో చేర్పించారు.