న్యూఢిల్లీ:ప్రపంచ క్రికెట్ లో భారత జట్టు ఫీల్డింగ్ అత్యుత్తమం అనడంలో ఎటువంటి సందేహం లేదని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లి అండ్ గ్యాంగ్ ఫీల్డింగ్ విషయంలో మరింత రాటుదేలిందన్నాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డింగ్ కల్గిన జట్లలో భారత్ కూడా చోటు సంపాదించిందన్నాడు.
'మన జట్టు ఆటగాళ్లు గ్రౌండ్ లో చాలా చురుగ్గా కదులుతున్నారు. ఇందులో మనం చాలా బెస్ట్ గా ఉన్నాం. మన ఫీల్డింగ్ మెరుగుకావడానికి ఐపీఎల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ పదే పదే ఆటగాళ్లను మారుస్తూ ఫీల్డింగ్ చేయడంతో అది జాతీయ జట్టుకు ఉపయోగపడుతుంది. ఇక ఎనిమిది ఓవర్ల గేమ్ లో ఒక చిన్నపొరపాటు మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. భారత బౌలర్ల ఫీల్డింగ్ స్కిల్క్స్ గతంలో చాలా పేలవంగా ఉండేవి. ఇప్పుడు వాటిని అధిగమించేందుకు బౌలర్లు చాలా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం భారత బౌలర్ల ఫిట్ నెస్ లెవల్స్ చాలా మెరుగ్గా ఉంది. దాంతోనే ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డింగ్ తో దూసుకుపోతున్నాం'అని శ్రీధర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment