సాధించిన పోలీసు నదియా | Sakshi
Sakshi News home page

సాధించిన పోలీసు నదియా

Published Thu, Nov 7 2019 8:08 AM

Woman Police Nadhiya Marriage With Lover Kannan in Karnataka - Sakshi

కర్ణాటక,కెలమంగలం: ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా పోలీసు కథ సుఖాంతమైంది. కోరుకున్న ప్రియునితోనే ఆమె పెళ్లి జరిగింది. అంచెట్టి తాలూకా పాండురంగన్‌దొడ్డి గ్రామానికి చెందిన పాండురంగన్‌ కూతురు నదియా (26) తిరుప్పూర్‌ సాయుధ విభాగంలో పోలీసుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన కణ్ణన్‌ (28) క్రిష్ణగిరిలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఇరువురూ గత 4 సంవత్సరాలుగా  ప్రేమించుకొంటున్నారు.

ఈ తరుణంలో పెళ్లి చేసుకుందామని నదియా కోరగా కణ్ణన్‌ నిరాకరించాడు. దీంతో జీవితం మీద విరక్తి చెందిన నదియా సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో డెంకణీకోట డీఎస్పీ సంగీత, అంచెట్టి పోలీసులు ఇరు కుటుంబాలతో చర్చించి పెళ్లికి ఒప్పించారు. వీరి పెళ్లి బుధవారం డెంకణీకోట సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. అనంతరం డెంకణీకోట సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో పెళ్లి నమోదు చేయించుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement