షావోమి బిగ్‌ లాంచ్‌ : ఎంఐ ఏ1 | MiA1 comes with a 5.5” Full HD display. It also comes with @corninggorilla! | Sakshi
Sakshi News home page

షావోమి బిగ్‌ లాంచ్‌ : ఎంఐ ఏ1

Published Tue, Sep 5 2017 1:05 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

షావోమి బిగ్‌ లాంచ్‌ : ఎంఐ ఏ1

షావోమి బిగ్‌ లాంచ్‌ : ఎంఐ ఏ1

సాక్షి, ముంబై:  చైనా మొబైల్‌  మేకర్‌ షావోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది.   బిగ్‌ లాంచ్‌ అంటూ  ఊరిస్తూ వచ్చిన కంపెనీ  ఎంఐ ఎ 1  పేరుతో డ్యుయల్‌ రియర్‌ కెమెరాలతో  దీన్ని  మార్కెట్లో ప్రవేశపెట్టింది.   షావోమి గ్లోబల్‌లాంచ్‌ 2017లో  ఇండియాలో మొట్ట మొదటి  రెండు రియర్‌ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ను  ఎంఐ లవర్స్‌కి అందుబాటులోకి తెచ్చింది. 

ఆన్‌లైన్‌  రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది.   ఫుల్‌ మెటల్‌బాడీ,  ప్రీమియం డిజైన్‌ , 10వీ స్మార్ట్‌ పీఏ హై క్వాలిటీ ఆడియో, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌లతోపాటు  డ్యూయల్‌ కెమెరా(ఫ్లాగ్‌ షిప్‌)(డీఎస్‌ఎల్‌ఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇన్‌ పాకెట్‌)  వన్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, వన్‌ వర్టికల్‌ కెమెరా  తమ తాజా డివైస్‌  ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది.  క్రియేటెడ్‌ బై షావోమి, పవర్డ్‌ బై గూగుల్‌ అని షావోమి తెలిపింది. దీని ధరను  రూ.14,999గా  నిర్ణయించింది. అయితే సెప్టెంబర్‌ 12వ  తేదీ మధ్యాహ్నం నుంచి ఇది విక్రయానికి అందుబాటులోఉండనుంది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి గూగుల్‌ తాజా ఓఎస్‌ ఓరియో  ఆప్‌డేట్‌ అందిస్తుందిట.



ఎంఐ ఏ1   ఫీచర్లు
5.5 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
కోర్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌
 క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 625 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1
4 జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌
128 దాకా విస్తరించుకునే  అవకాశం
12 ఎంపీ పిక్సెల్‌ డ్యుయల్‌ రియర్‌  కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement