30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం | Assembly special session to be held on April 30 | Sakshi
Sakshi News home page

30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Published Thu, Apr 27 2017 8:32 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఈ నెల 30వ తేదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ మేరకు గురువారం శాసనసభ వ్యవహారల కార్యదర్శి రాజా సదరాం షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ వివరాలను గవర్నర్‌, ముఖ్యమంత్రుల ప్రిన్సిపల్‌ కార్యదర్శులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులకు అందించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శాసనసభ(7వ సెషన్‌, మూడో సమావేశం), మధ్యాహ్నం 3 గంటలకు మండలి సమావేశం జరుగుతుందని అందులో పేర్కొన్నారు.

సమావేశాలకు ముందు రోజు ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు స్పీకర్‌ మధుసూధనాచారి అధ్యక్షతన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరుగనుంది. ప్రత్యేక సమావేశంలో ఆమోదించే బిల్లులపై విపక్ష పార్టీల నేతలకు బీఏసీలో వివరించి వారి సహకారం కోరే అవకాశం ఉంది. ఇక ప్రత్యేక సమావేశంలో గత ఏడాది డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన భూసేకరణ బిల్లులో కేంద్రం సూచించిన సవరణలపై చర్చించి మార్పులతో తిరిగి బిల్లుని ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. దీంతో పాటే తెలంగాణ రాష్ట్ర నకిలీ విత్తన నిరోధక చట్టం బిల్లును కూడా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రైతుల్ని తీవ్రంగా నష్ట పరుస్తున్న నకిలీ విత్తనాల విక్రయంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దీని కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురానున్నట్లు ఇటీవల సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశంలోనే ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement