టీఆర్‌ఎస్‌ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్‌ | CM KCR speech in TRS pleenary in kompally | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్‌

Published Fri, Apr 21 2017 12:00 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

టీఆర్‌ఎస్‌ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్‌ - Sakshi

టీఆర్‌ఎస్‌ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్‌

హైదరాబాద్‌: తనను వరుసగా ఎనిమిదోసారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కొంపెల్లిలో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. 2001లో టీఆర్‌ఎస్‌​ జెండా తొలిసారి ఎగిరినప్పుడు అన్నీ అనుమానాలే ఉండేవని, పార్టీ ఉంటుందో లేదోనని చాలామంది అనుమానపడ్డరని అన్నారు. ఈ 16 ఏళ్ల ప్రస్థానంలో మనం ఎన్నో అనుమానాలను ఎదుర్కొన్నామని పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • 15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం
  • భయంకరమైన జీవన విధ్వంసంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది
  • తెలంగాణ వచ్చినప్పుడు అన్నీ సమస్యలే ఉన్నాయి
  • 60 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్‌ పాలన అంతా అస్తవ్యస్తమే
  • రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతోంది
  • పేదల సంక్షేమానికి పెద్దపీట వేశాం. వారి సంక్షేమం కోసం రూ. 40 కోట్ల బడ్జెట్‌ను వినియోగిస్తున్నాం
  • మిషన్‌ భగీరథలో భాగంగా ఈ సంవత్సరం చివరినాటికి అన్ని గ్రామాలకూ కృష్ణ, గో​దావరి నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం
  • రైతుల మేలు కొరకు కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యం
  • అసంపూర్తి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం
  • ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌లో నాలుగున్న లక్షల ఎకరాలకు నీరు అందించాం
  • చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చాం
  • కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి దుష్ర్పచారం చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి
  • రాష్ట్రంలో నేషనల్‌ హైవేస్‌ విషయంలో జాతీయ సగటును మించిపోయాం
  • అన్ని కులాలు వారు, అన్ని మతాలవారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement