సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ
ముంబై: 2016-17 ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభ లో ప్రవేశపెట్టారు. డీమానిటైజేషన్, అయిదు రాష్ట్రాల ఎన్నికలు నేపథ్యంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ యూనియన్ బడ్జెట్ లో అనేక మెరుపులు, వరాలు కురిపించారు ఆర్ధికమంత్రి. గ్రామీణ యువత, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వెనుకబడిన వర్గాలపై అనేక వరాలు గుప్పించారు. అయితే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 6 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో సెల్ ఫోన్లు,సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా దలాల్ స్ట్రీట్ అంచనాలకనుగుణంగానే సిగరెట్లపై పన్ను మోత మోగింది. అటు కనీసం 10 శాతం పెంపును అంచనావేసిన ట్రేడర్లు దీంతో సిగరెట్ తయారీ కంపెనీల కౌంటర్లలో మదుపర్లు దృష్టిసారించారు.
అలాగే సెల్ ఫోన్ కూడా కస్టమ్స్ లెవీ కారణంగా 1శాతం ధరలు పెరగనున్నాయి. సెల్ ఫోన్ విడిభాగాల పై విధించిన పన్నుకారణంగా ఈ ధరలు పెరగనున్నాయి.
పెరిగిన పన్ను వివరాలు
వెయ్యి సిగరెట్లపై పన్ను రూ.215 నుంచి 311కు పెంపు
పాన్ మసాలాపై 6నుంచి 9 శాతం
దిగుమతి చేసుకున్న అల్యూమినియంపై 30 శాతం పన్ను
సెల్ ఫోన్లలో వాడే సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ) లపై 2 శాతం
మరోవైపు తాజా బడ్జెట్‌లో వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధిని సాధించగలదని వేసిన అంచనాతో ఎఫ్‌ఎంసీజీ రంగం బాగా పుంజుకోనుంది. గ్రామీణాభివృద్ధి, పేదలకు కనీస ఆదాయ కల్పన, నీటిపారుదల సౌకర్యాలకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా ఇందుకు తోడ్పడతాయని నిపుణులు పేర్కొన్నారు.
(సంబంధిత వార్తలు..)
గృహ రంగానికి గుడ్న్యూస్
పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు!
బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే..
ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు
ఆదాయపన్ను రేట్లు ఇలా..
తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ