amit mishra
-
'కోహ్లిలో ఏ మార్పు లేదు.. మేమిద్దరం మంచి స్నేహితులం'
టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇటీవల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ అయ్యాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి అని ఓ ఇంటర్వ్యూలో మిశ్రా సంచలన కామెంట్స్ చేశాడు.తాజాగా ఇదే విషయంపై అమిత్ మిశ్రాకు మరో వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పరోక్షంగా కౌంటరిచ్చాడు. కోహ్లితో తనకు మంచి అనుబంధం ఉందని, అతడిలో ఎటువంటి మార్పు రాలేదు అని చావ్లా చెప్పుకొచ్చాడు."విరాట్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి జానియర్ స్ధాయిలో క్రికెట్ ఆడాము. ఆ తర్వాత ఐపీఎల్, భారత జట్టుకు కూడా మేము కలిసి ఆడాము. అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా కోహ్లి అలానే ఉన్నాడు. ఎక్కడ కలిసినా కూడా అంతే ప్రేమ, అభిమానాన్ని చూపిస్తాడు. మేమిద్దరం భోజన ప్రియులం. గతేడాది ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించినప్పుడు నేను విరాట్ బ్రేక్ సమయంలో కలుసుకున్నాము.అతడు నాదగ్గరకు వచ్చి మనద్దరికి మంచి ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పాడు. నేను అందుకు నవ్వతూ సరే అన్నానని" శుభమన్ గౌర్ అనే యూట్యాబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు. -
‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’
సంజూ శాంసన్.. ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌కు అంతర్జాతీయ క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదనేది అతడి అభిమానుల వాదన. ప్రతిభ ఉన్నా ఈ కేరళ ఆటగాడి పట్ల సెలక్టర్లు వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్-2023 సమయంలో మెరుగైన గణాంకాలున్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు ఇచ్చారు. అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించారు. ఈ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోవడంతో జట్టు యాజమాన్యం విమర్శలపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్-2024 రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా సత్తా చాటిన సంజూ ఎట్టకేలకు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.అయితే, రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన సంజూకు.. తదుపరి శ్రీలంక టూర్‌కు వెళ్లబోయే జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది. వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమేఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజూ శాంసన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో సంజూకు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు మరో వరల్డ్‌కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే అతడికి వయసు మీద పడింది. టీ20 జట్టులో యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తామనే సంప్రదాయాన్ని విరాట్ కోహ్లి ప్రవేశపెట్టాడు.వాళ్లే బాగా ఆడతారని అతడి నమ్మకం. అయితే, తనకు 35 ఏళ్లు వచ్చినా కోహ్లి ఆడాడనుకోండి. అది వేరే విషయం. ఒకవేళ శాంసన్ గనుక టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాలి.వారి నుంచి తీవ్రమైన పోటీఅలా అయితే, రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కుతుంది. లేదంటే కష్టమే. నిజానికి ఇషాన్ కిషన్ అత్యంత ప్రతిభ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్.కానీ అతడిని టీ20ల నుంచి పక్కనపెట్టేశారు. ఇక రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అతడొక అత్యుత్తమ ప్లేయర్. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ.. ఇలా వికెట్ కీపర్ల లిస్టు పెద్దగానే ఉంది. కాబట్టి సంజూ శ్రమించక తప్పదు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.కాగా 29 ఏళ్ల సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 28 అంతర్జాతీయ టీ20లలో సంజూ 444 రన్స్ సాధించాడు. చదవండి: హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే! -
టీమిండియా కెప్టెన్‌గా అతడు పనికిరాడు: భారత క్రికెటర్
జింబాబ్వే పర్యటనను శబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఘనంగా ముగించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో తేడాతో భారత్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమిండియా దెబ్బ తిన్న సింహంలా గర్జించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును భారత్ చిత్తు చేసింది. తొలిసారి భారత జట్టు పగ్గాలను చేపట్టిన శుబ్‌మన్ గిల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో గిల్ కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఆకట్టుకున్నాడు. అయితే శుబ్‌మన్ గిల్‌ను అందరూ ప్రశంసిస్తుంటే.. భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గిల్ కెప్టెన్‌గా పనికిరాడని, అస్సలు నాయకత్వ లక్షణాలు లేవని మిశ్రా తెలిపాడు. మిశ్రా తాజాగా శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న మిశ్రాకు ఎదురైంది."భారత్ ఫ్యూచర్ కెప్టెన్‌గా గిల్‌ను అస్సలు నేను ఎంపిక చేయను. అతడికి అస్సలు కెప్టెన్సీ స్కిల్స్ లేవు. ఐపీఎల్‌లోనే అతడి నాయకత్వాన్ని చూశాను. అతనికి కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియదని" మిశ్రా బదులిచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గిల్.. తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించి లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. -
'కెప్టెన్ అయ్యాక కోహ్లి చాలా మారిపోయాడు.. కానీ రోహిత్ అలా కాదు'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ అయినా తర్వాత విరాట్ ప్రవర్తనా విధానంలో తేడా వచ్చిందని మిశ్రా తెలిపాడు.ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి మధ్య ఎంతో తేడా ఉందని మిశ్రా అభిప్రాయపడ్డాడు. మిశ్రా తాజాగా శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి, రోహిత్లో ఎవరు బెస్ట్ కెప్టెన్ ? ఎవరికి జట్టులో స్నేహితులు ఎక్కువ? అనే ప్రశ్నలు మిశ్రాకు ఎదురయ్యాయి."నేను అబద్దం చెప్పను. ఒక క్రికెటర్‌గా విరాట్‌ని నేను చాలా గౌరవిస్తాను. కానీ కోహ్లి కెప్టెన్ అయ్యాక అతడిలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే గతంలో అతనితో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదు. దాదాపుగా మాట్లాడటం మానేశాను.కోహ్లికి ఒక ఫేమ్ వచ్చాక వచ్చాక పూర్తిగా మారిపోయాడు. అందుకే అతడికి జట్టులో స్నేహితులు తక్కువ. మనకు కీర్తి, డబ్బు వచ్చింది కాబట్టి, ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించే మన దగ్గరకు వస్తారని కొందరు అనుకుంటారు.కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. అయితే రోహిత్ శర్మకు విరాట్‌కు చాలా తేడా ఉంది. విరాట్, రోహిత్ స్వభావాలు వేరు. రోహిత్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రోహిత్‌ను మొదటి రోజు కలిసినప్పిడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. నేను కొన్నేళ్లుగా భారత జట్టులో భాగం కాలేదు. కానీ ఇప్పటకీ నేను రోహిత్‌ను ఐపీఎల్లో లేదా మరేదైనా ఈవెంట్లో కలిసినప్పుడు అతడు చాలా సరదగా మాట్లాడుతుంటాడు. భారత జట్టు కెప్టెన్ అయినా నాతో స్నేహంగా మెలిగి జోక్‌లు వేసేవాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్‌లోనే నెం1 కెప్టెన్. వరల్డ్ కప్ విజేత. అంతేకాదు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు’ అని మిశ్రా పేర్కొన్నాడు. Amit Mishra said "Woh khush nhi tha IPL mein! Rohit uss cheez se 100 percent upset hua hoga, kyunki woh emotional aadmi hai"That c* franchise played with him and his precious emotions and few dumba** were like why his fans are making a fuss out of it and all that bullcrap! pic.twitter.com/Ov2NDD24p1— S:) (@sunskie_45) July 15, 2024 -
అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్! భారీ జరిమానా
ఐపీఎల్-2023లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్లేఆఫ్ రేసు నుంచి ఎస్ఆర్హెచ్ నిష్క్రమించింది. ఇక ఎస్ఆర్హెచ్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు క్లాసెన్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్‌లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. క్లాసెన్ లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని ఐపీఎల్ నిర్వహకులు తెలిపారు. ఈ మ్యా్చ్లో 29 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రాకు కూడా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో ఎక్విప్‌మెంట్‌పై ప్రతాపం చూపించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. నో బాల్ వివాదం ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ల 19 ఓవర్ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే లక్నో కెప్టెన్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. అయితే రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ బంతి క్లియర్‌గా ఉందని.. నో బాల్ కాదని చెప్పాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినప్పటికీ.. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించడం క్రీజులో ఉన్న సమద్, క్లాసెన్‌తో పాటు అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో క్లాసెన్ లెగ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా ఎస్ఆర్హెచ్ అభిమానులు అయితే కాస్త అతి చేశారు. నట్టులు, మేకులు లక్నో డగౌట్పైన విసిరారు. దీంతో మ్యాచ్‌కు కాసేపు నిలిపివేశారు. కాగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగినుందకే క్లాసెన్‌కు జరిమానా పడినట్లు తెలుస్తోంది. చదవండి: #SunilGavaskarVsHCA: హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్ -
CSK VS MI: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న పియూష్ చావ్లా.. మూడో స్థానానికి..!
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా మూడో స్థానానికి ఎగబాకాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన చావ్లా.. సహచర వెటరన్, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను వెనక్కు నెట్టి టాప్-3లోకి చేరాడు. ప్రస్తుతం పియూష్ ఖాతాలో 173 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (183) టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ స్పిన్నర్ చహల్ రెండులో.. పియూష్, అమిత్ మిశ్రా (172), మలింగ (170), అశ్విన్ (170) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. కాగా, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిధ్య సీఎస్కే గెలుపు దిశగా సాగుతోంది. ఆ జట్టు మరో 17 పరుగులు చేస్తే (15 ఓవర్లలో 123/3) సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేస్తుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సీఎస్కే బౌలర్లు పతిరణ (4-0-15-3), దీపక్ చాహర్ (3-0-18-2), తుషార్ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్ వధేరా (64) ఒక్కడే రాణించాడు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేకు ఓపెనర్లు డెవాన్ కాన్వే (41నాటౌట్), శివమ్ దూబే (16 నాటౌట్) విజయం దిశగా నడిపిస్తున్నారు. రుతురాజ్ (30), రహానే (21), రాయుడు (12) ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2, ట్రిస్టన్ స్టబ్స్‌కు ఓ వికెట్ దక్కింది. చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..!
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ పడగొట్టడం ద్వారా మిశ్రా ఐపీఎల్ టాప్-3 బౌలర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు. మూడో ప్లేస్‌కు ఎగబాకే క్రమంలో మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చహల్ (140 మ్యాచ్‌ల్లో 178) రెండో స్థానంలో, అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు) మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఒక్క వికెట్‌తో ముగ్గురిని అధిగమించిన మిశ్రా.. ఐపీఎల్లో టాప్-3 బౌలర్ స్థానానికి చేరుకునే క్రమంలో అమిత్ మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు 169 వికెట్లు కలిగిన మిశ్రా.. ఒక్క వికెట్‌తో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170), ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (193 మ్యాచ్‌ల్లో 170)లను దాటేశాడు. మరో వికెట్ కూడా.. ఈ మ్యాచ్‌లో మిశ్రా ఖాతాలో మరో వికెట్ కూడా పడింది. దీంతో అతని వికెట్ల సంఖ్య 172కు చేరింది. రెండో స్థానంలో ఉన్న చహల్‌కు మిశ్రాకు కేవలం 6 వికెట్ల తేడా మాత్రమే ఉంది. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ తర్వాత మిశ్రా.. కీలకమైన డుప్లెసిస్ వికెట్ తీశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 115/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (15), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
అమిత్ మిశ్రాపై విరాట్ కోహ్లీ ఫాన్స్ ఫైర్..
-
RCB VS LSG: అమిత్ మిశ్రా తొండాట.. కోహ్లి బలయ్యాడు..!
ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ కీలక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరలవుతోంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఈ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. నిన్నటి మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా బంతిపై ఉమ్మిని రాస్తూ కనిపించాడు. Is saliva allowed in ipl?? #iplinhindi #IPL2023 #ipl #rcb #JioCinema pic.twitter.com/Uh7hiR7D2G — ROHIT RAJ (@RohitRajSinhaa) April 10, 2023 ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్య నిషేధించబడింది. కోవిడ్ అనంతరం ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఉమ్మికి బదులు బంతిపై చమటను అప్లై చేసేందుకు ఐసీసీ పర్మిషన్ ఇచ్చింది. ఈ కారణంగానే అమిత్ మిశ్రా చర్యపై క్రికెట్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. మిశ్రా చర్యను మెజార్టీ శాతం తప్పుపడుతున్నారు. తెలిసి చేసినా, పొరపాటున చేసినా మిశ్రాపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. మిశ్రా బంతిపై ఉమ్మిని రుద్దిన ఓవర్లోనే (మూడో బంతికి) విరాట్ కోహ్లి ఔట్ కావడంతో.. రన్ మెషీన్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. మిశ్రా తొండాట ఆడాడని.. అలా చేయకపోయి ఉంటే కోహ్లి ఔటయ్యే వాడే కాదని వితండవాదానికి దిగుతున్నారు. ఉమ్మి అప్లై చేయడం వల్ల బంతి షైన్ అయ్యి కోహ్లి ఔట్ కావడానికి కారణమైందని కామెంట్స్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఇలాంటి చర్యకు పాల్పడినందుకు మిశ్రా జట్టు లక్నోకు 5 పరుగుల పెనాల్టి విధించి ఆర్సీబీని విజేతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ నిషేధించింది కాబట్టి మిశ్రా అలా చేయడం తప్పని మరికొందరు అంటున్నారు. కాగా, 2021 ఐపీఎల్‌లోనూ మిశ్రా ఇలాంటి చర్యకే పాల్పడి అంపైర్ వార్నంగ్కు గురయ్యాడు. ఈ చర్య మరోసారి రిపీట్ చేస్తే పెనాల్టి విధిస్తానని అప్పుడు అంపైర్ మిశ్రాను గట్టిగా మందలించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో లక్నో విజయం సాధించింది. -
Amit Mishra: స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అమిత్ మిశ్రా 40 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఒక క్రికెటర్‌కు 40 ఏళ్లు వచ్చాయంటే మాములుగా అయితే రిస్క్‌లు చేయడానికి ఇష్టపడడు. కానీ మిశ్రా అలా కాదు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అమిత్ మిశ్రా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి థర్డ్‌మన్ దిశగా ఆడాలనుకున్నాడు. అయితే బంతి ఔట్‌సైడ్ అయి బ్యాట్ ఎడ్జ్ అయి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న అమిత్ మిశ్రా ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మిశ్రా కళ్లు చెదిరే క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ''స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి అని మిశ్రా నిరూపించాడు''.. ''40 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్న మిశ్రాకు హ్యాట్సాఫ్'' అంటూ కామెంట్ చేశారు. ఇక బౌలింగ్‌లోనూ అమిత్ మిశ్రా మెరిశాడు. తన ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ఐపీఎల్లో తన వికెట్ల సంఖ్యను 168కి పెంచుకున్నాడు. మార్క్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అమిత్ మిశ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా అమిత్ మిశ్రా ఐపీఎల్లో 155 మ్యాచ్‌లాడి 168 వికెట్లు తీసుకున్నాడు. 40 Years Old Amit Mishra while making debut for Lucknow & taking this catch means age is just a number for him #LSGvsSRH #MIvsCSK #amitmishra #T20 #IPL #IPL2023 #cricketmatlabMyfab11 #CricketTwitter pic.twitter.com/ZC3dZYh6LP — raman thind (@thindpau87) April 7, 2023 40 years O̵l̵d̵ young 🙌 Amit Mishra took a brilliant diving catch much to the delight of his teammates. Also bowled a brilliant spell of 4-0-23-2 📸 : Jio Cinema#LSGvSRH #IPL2023 pic.twitter.com/X8rnIqBTIC — 12th Khiladi (@12th_khiladi) April 7, 2023 -
కంగ్రాట్స్ ఐర్లాండ్.. ఇంగ్లండ్ అలా అనకుంటే చాలు!
టి20 ప్రపంచకప్‌లో ఈసారి పరుగుల కన్నా వర్షం తన జోరు చూపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన వరుణుడు.. ఈసారి ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బను మిగిల్చాడు. అంతేకాదు అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం ఆటంకం కలిగించే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ గెలిచినట్లు పేర్కొన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయాన్ని దక్కించుకున్న ఐర్లాండ్‌కు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ''ఏదైతేనేం.. ఇంగ్లండ్ లాంటి టాప్ జట్టును మట్టికరిపించింది'' అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా స్పందించాడు. ''కంగ్రాట్స్ ఐర్లాండ్.. అయితే డక్‌వర్త్ లూయిస్ అనేది క్రీడాస్పూర్తికి విరుద్దం అని ఇంగ్లండ్ అనదనే నమ్మకంతోనే ఉన్నా'' అంటూ వినూత్నంగా స్పందించాడు. ఇంతకముందు టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలు మన్కడింగ్ చేయడంపై క్రీడాస్పూర్తికి విరుద్ధమంటూ ఇంగ్లండ్ నానా యాగీ చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే అమిత్ మిశ్రా ఇంగ్లండ్ జట్టుకు కౌంటర్ ఇచ్చాడంటూ కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ పూర్తిగా సాగకుండానే ఫలితం వచ్చింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. మార్క్ వుడ్ (3/34), లివింగ్‌స్టోన్ (3/17), సామ్ కర్రన్ (2/31), స్టోక్స్ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన మలాన్ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. చదవండి: 'అవసరమా మనకు.. 'స్పైడర్'ను బ్యాన్ చేయండి' Congratulations @cricketireland on a massive victory. Hope England doesn’t say winning through DLS isn’t in the spirit of the game. 😄 #EngvsIRE pic.twitter.com/0S4L5f1ZTi — Amit Mishra (@MishiAmit) October 26, 2022 Group 1's elite toples over to the luck of the three leaf clover! #irevseng #T20worldcup22 — Brad Hogg (@Brad_Hogg) October 26, 2022 IRE Vs ENG: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’ -
Amit Mishra: గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లాలి! 300 కాదు ఐదొందలు తీసుకో!
Amit Mishra Viral Tweet: టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు. అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తూ ట్రోలింగ్ బారిన పడతాడు కూడా! ట్విటర్లో 1.4 మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న అమిత్ మిశ్రాకు.. ఇటీవల ఓ అభిమాని నుంచి అతడికి ఓ రిక్వెస్టు వచ్చింది. 300 కాదు.. ఐదొందలు తీసుకో తన గర్ల్‌ఫ్రెండ్‌ను డేట్‌కు తీసుకువెళ్లాలనుకుంటున్నానని.. ఇందుకు తనకు మూడు వందల రూపాయలు ఇచ్చి సాయం చేయాలని ఓ ఫ్యాన్ అమిత్ మిశ్రాను ట్యాగ్ చేశాడు. అయితే, అతడి అభ్యర్థనను ‘సీరియస్’గా తీసుకున్న మిశ్రా.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా 500 రూపాయలు పంపించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘‘పంపించాను. డేట్‌కి వెళ్తున్నావుగా.. ఆల్ ది బెస్ట్’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. నిజమే అంటారా? అమిత్ మిశ్రా ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘సర్ నా దగ్గర డబ్బు ఉంది కానీ. బాయ్‌ఫ్రెండ్ లేడు. సాయం చేయగలరా?’’ అని ఓ అమ్మాయి కొంటెగా అడుగగా.. డబ్బులిచ్చీ మరీ అబ్బాయిని చెడగొడుతున్నారండీ అంటూ మరొకరు ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఇంకొందరేమో.. ‘‘నిజంగా డేట్‌కి వెళ్లి ఉంటే ఆ ఫొటోలు కూడా షేర్ చేయమని చెప్పండి. మీరు మాతో ఆ ఫొటోలు పంచుకోండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తానికి అలా.. మూడు వందలు అడిగితే 500 ఇచ్చి ‘ఉదారత’ను చాటుకున్న అమిత్ మిశ్రా నెట్టింట వైరల్‌గా మారాడు. ఆ మ్యాచ్ చివరిది టీమిండియా తరఫున 2003లో సౌతాఫ్రికాతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా.. 2008లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 2010లో పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన ఈ స్పిన్ బౌలర్.. 2017లో చివరిసారిగా టీమిండియాకు ఆడాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు ఢిల్లీ జట్టుకు అమిత్ మిశ్రా ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మెగా వేలం-2022లో మాత్రం అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో క్యాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు)గా మిశ్రా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. గతేడాది ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ అతడికి ఐపీఎల్లో చివరిది. చదవండి: T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్ గెలవడం కష్టమే: ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ Ind Vs Sa 2nd T20: సూర్య మరో 24 పరుగులు సాధించాడంటే! ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే Done, all the best for your date. 😅 https://t.co/KuH7afgnF8 pic.twitter.com/nkwZM4FM2u — Amit Mishra (@MishiAmit) September 29, 2022 -
'అందరూ నీలా ఉండరు'.. అఫ్రిదిని ఏకిపారేసిన టీమిండియా వెటరన్ క్రికెటర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాసిన్ మాలిక్ వ్యవహారంలో వెటకారంగా మాట్లాడిన అఫ్రిదికి అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాసిన్ మాలిక్ నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలాగా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పరని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. విషయంలోకి వెళితే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి యాసిన్‌పై అభియోగాలు వచ్చాయి. విచారణలో అవన్నీ నిజమని తేలాయి. దీంతో యాసిన్ మాలికు జీవితకాల జైలుశిక్షతోపాటు రూ. పది లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. అంతకముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డియర్ షాహిద్ అఫ్రిది.. అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'' అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అఫ్రిదిపై ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. చదవండి: Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z — Amit Mishra (@MishiAmit) May 25, 2022 India's continued attempts to silence critical voices against its blatant human right abuses are futile. Fabricated charges against #YasinMalik will not put a hold to #Kashmir's struggle to freedom. Urging the #UN to take notice of unfair & illegal trails against Kashmir leaders. pic.twitter.com/EEJV5jyzmN — Shahid Afridi (@SAfridiOfficial) May 25, 2022 -
IPL 2022: ఆర్సీబీ టైటిల్ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..!
Amit Mishra Tweet: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్ 12) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ రంగాల్లో రాణించి సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. Really worried about her parents right now.. #CSKvsRCB pic.twitter.com/fThl53BlTX — Amit Mishra (@MishiAmit) April 12, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచేంతవరకు వరకూ పెళ్లి చేసుకోనంటూ ఓ అమ్మడు ప్లకార్డుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐపీఎల్ లీడింగ్ వికెట్టేకర్లలో ఒకరైన అమిత్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందంటూ క్యాప్షన్ జోడించిన ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. భారీ స్థాయిలో ట్రోల్స్ పేలుతున్నాయి. మంగమ్మ శపథం చేయకు తల్లీ.. జీవితాంతం సింగిల్‌గానే మిగిలిపోగలవంటూ నెటిజన్లు ఆర్సీబీకి వ్యతిరేకంగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్డేట్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: మిశీ భాయ్, నీ సేవలకు సలాం.. ఢిల్లీ జట్టు ఎప్పటికీ నీదే..!
ఐపీఎల్ కెరీర్లో సింహ భాగం ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, లీగ్ చరిత్రలో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు) నిలిచిన అమిత్ మిశ్రాను తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కూడా సొంతం చేసుకోకపోవడంతో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్‌ను ఉద్దేశిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ జిందాల్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. To one of the @IPL greats @MishiAmit we @DelhiCapitals would like to salute everything you have done for us over all these years and would love to have you back at DC in whatever capacity you see fit as your insights would be most valuable. Mishy bhai DC is yours for life — Parth Jindal (@ParthJindal11) February 13, 2022 ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడివైన మిశి భాయ్.. ఢిల్లీ క్యాపిటల్స్ నీ సేవలకు సలాం చేస్తుంది, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ సేవలను వినియోగించుకునేందుకు డీసీ జట్టు సిద్ధంగా ఉంది, ఈ జట్టు ఎప్పటికీ నీదే అంటూ పార్థ.. ట్విటర్ వేదికగా ఐపీఎల్ దిగ్గజ స్పిన్నర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ట్విట్‌ను బట్టి చూస్తే.. డీసీ జట్టు అమిత్ మిశ్రా సేవలకు పరోక్షంగా వినియోగించుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కోటి రూపాయల బేస్ ప్రైజ్ విభాగంలో పేరును నమోదు చేసుకున్న అమిత్ మిశ్రాపై ఢిల్లీ సహా ఏ ఇతర ఐపీఎల్ జట్టు కూడా ఆసక్తి కనబర్చలేదు. మిశ్రా గతేడాది లీగ్‌లో చివరిసారిగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దర్శనమిచ్చాడు. ఆ మ్యాచ్‌లో మిశ్రా 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించకుని ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో అమిత్ మిశ్రాతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, పుజారా, కేదార్ జాదవ్, హనుమ విహారిలపై కూడా ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ టీమిండియా వెటరన్ క్రికెటర్లంతా అమ్ముడుపోని ఆటగాళ్లుగా మిగిలిపోయారు. చదవండి: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు -
"ఏంటి మిశ్రా మత్తులో ఉన్నావా.. ఇది తొలి టెస్ట్ మాత్రమే"
సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే అక్కడే మిశ్రా పప్పులో కాలేశాడు. "విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు. చారిత్రత్మక విజయం సాధించి తొలి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్నందుకు గర్వంగా ఉంది" అని మిశ్రా ట్విటర్లో పేర్కొన్నాడు. ఇంకేమి ఉంది ఇక్కడే మిశ్రా నెటిజన్లుకు దొరికిపోయాడు. మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలిచినందుకు టీమిండియాకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన మిశ్రాని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. "ఏంటి మిశ్రా మత్తులో ఉండి ట్వీట్ చేశావా" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇలా తప్పుగా ట్వీట్ చేయడం మిశ్రా ఇదేం కొత్త కాదు. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021 విజేత న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: Virat Kohli- Vamika: ‘చిట్టితల్లి... నాన్న గెలిచాడు వామిక.. ఆ సంతోషం వెలకట్టలేనిది’.. వీడియో వైరల్ Congratulations team India. Very well played. A historic win for India as they record their first Test series sweep against South Africa. A proud moment. #IndvsSA #BCCI #TestSeries #TeamIndia #IndiaToday #AajTak #ZeeNews #StarSports #SonySports #NDTVSports #IndiaTv #SportsTak pic.twitter.com/kfYlGfzMYg — Amit Mishra (@MishiAmit) December 30, 2021 -
విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Amit Mishra: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌లాగే తనకు కూడా అన్యాయం జరిగిందని అర్ధం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆయన ఫైరయ్యాడు. టీమిండియాలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. బీసీసీఐ అకారణంగా వారిపై వేటు వేసిందని పరోక్షంగా తన గురించిన తెస్తూ బీసీసీఐపై మండిపడ్డాడు. బీసీసీఐకి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదని, గతంలో తనతో సహా చాలామంది క్రికెటర్ల విషయంలోనూ ఇలానే వ్యవహరించిదని సంచలన కామెంట్స్ చేశాడు. జట్టులో చోటు దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడే ప్లేయర్లకు తమను జట్టులో నుంచి ఎందుకు తొలగిస్తున్నారో తెలుసుకునే హక్కు ఉంటుందని అన్నాడు. ఆటగాళ్ల ఉద్వాసనకు గల కారణాలు తెలిస్తే.. ఆ విభాగంలో మెరుగయ్యేందుకు కృషి చేస్తారని పేర్కొన్నాడు. కాగా, అమిత్ మిశ్రా 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి సత్తా చాటినా అతన్ని జట్టులో నుంచి తొలగించారు. అనంతరం 2017లో తిరిగి జట్టులోకి వచ్చిన అతను.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించినప్పటికీ.. అకారణంగా అతన్ని పక్కకు పెట్టేశారు. 39 ఏళ్ల అమిత్ మిశ్రా భారత జట్టు తరఫున 22 టెస్ట్‌ల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 8 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాలో కుంబ్లే, హర్భజన్, అశ్విన్ హవా నడుస్తుండటంతో అతను జట్టులోకి వస్తూ, పోతూ ఉండేవాడు. ఐపీఎల్లో మలింగ(170) తర్వాత 166 వికెట్లతో లీగ్‌లో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా ఉన్నప్పటికీ.. టీమిండియాలో అతనికి తగినన్ని అవకాశాలు దక్కలేదు. చదవండి: Ashes 2nd Test: పాపం వార్నర్.. వందేళ్లలో ఒకే ఒక్కడు -
T20 WC 2021 Winner: మ్యాచ్ చూడలేదా అమిత్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
T20 WC 2021 Winner Australia: Amit Mishra Getting Trolled Why Deletes Tweet: టీమిండియా వెటరన్ ప్లేయర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘‘అయ్యో.. ఇదేంటి అమిత్ మ్యాచ్ చూడలేదా ఏంటి?’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నవంబరు 14న దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇన్నాళ్లు ఊరిస్తున్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సైతం... విజేతను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే, అక్కడే అమిత్ పప్పులో కాలేశాడు. ‘‘వరల్డ్‌కప్ గెలిచిన బ్లాక్‌కాప్స్‌కు శుభాకాంక్షలు. సమష్టి విజయం. చాలా బాగా ఆడారు’’ అని ట్వీటాడు. విన్నర్ ఆసీస్‌కు బదులు న్యూజిలాండ్‌కు విషెస్ చెప్పాడు. ఇంకేం ఉంది.. అమిత్ మిశ్రా ‘తప్పిదాన్ని’ గుర్తించిన నెటిజన్లు ఫన్నీగా అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో.. అమిత్ మిశ్రా తన ట్వీట్‌ను డెలిట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ హాండిల్ స్థానంలో ఆసీస్‌ను రీప్లేస్ చేసి అభినందనలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. స్కోర్లు: న్యూజిలాండ్- 172/4 (20) ఆస్ట్రేలియా- 173/2 (18.5) చదవండి: Kane Williamson: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్.. మనసులు గెలిచారు! -
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్న భారత ఆటగాళ్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ ఐపీఎల్- 2021 సెకండ్ ఫేజ్ ప్రారంభమైంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది . అయితే ఈ సీజన్ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు లీగ్‌కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం. హర్భజన్ సింగ్ హర్భజన్ సింగ్ భారత అత్యత్తుమ స్పిన్నర్లలోఒకడు. టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా 2001లో అరుదైన ఘనత సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు. పది సీజన్ల తరువాత 2018 లో ముంబై భజ్జీను వేలంలో పెట్టింది. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధరతో అతడుని దక్కించుకోంది. ఆనంతరం రెండు సీజన్ల తరువాత 2021లో చెన్నై కూడా హర్భజన్ ను వేలంలో పెట్టింది. ఈ ఏడాది సీజన్లో ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ మెదటి దశలో కోల్‌కతా తరుపున అతడకి తుది జట్టులో పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జూలైలో 40వ పడిలోకి అడుగు పెట్టిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ పూర్తయిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరియర్లో 160 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ సింగ్ మొత్తం 150 వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా అమిత్ మిశ్రా భారత లెగ్ స్పిన్ దిగ్గజం. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ డెర్‌డెవిల్స్ తో ప్రారంభించాడు. ఆ తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్, పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ లో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్లో మిశ్రా తన పేరు మీద అనేక రికార్డులు కలిగి ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా మిశ్రా ఉన్నాడు. ఈ లీగ్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు(3) సాధించిన బౌలర్‌గా అమిత్ మిశ్రా రికార్డు సాధించాడు. అయితే.. వెటరన్ స్పిన్నర్ కొన్ని నెలల్లో 39 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఇదే అతని అఖరి సీజన్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 154 మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 166 వికెట్లు సాధించాడు. వృద్ధిమాన్ సాహా సాహా తన కెరీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తో ప్రారంభించాడు. ఆ తరువాత మూడు సీజన్ల ఆనంతరం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్‌కు ప్రతినిధ్యం వహించాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌కు ఆజట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూరమయ్యాడు. ఈ క్రమంలో సాహా హైదరాబాద్‌కు ఓపెనింగ్ చేసే అవకాశాఉ ఉన్నాయి. కాగా మరో నెలలో 37 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సాహా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని సమాచారం. కాగా సాహా తన ఐపీఎల్ కెరీర్లో 126 మ్యాచ్‌లు ఆడి 1987 పరుగులు సాధించాడు. కేదార్ జాదవ్ కేదార్ జాదవ్ ఐపీఎల్లో ఆద్బతమైన ఆటగాడు కానప్పటికీ, తన ఐపీఎల్ కెరీర్లో కొన్ని మ్యాచ్‌లలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జాదవ్ తన కేరిర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించగా.. 2018లో అతడుని చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆనంతరం 2021లో చెన్నై జాదవ్‌ను వేలంలో పెట్టింది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కేదార్‌ను దక్కించుకోంది. 36 ఏళ్ల జాదవ్ ఫామ్‌లో లేనందున, ఇది అతని చివరి సీజన్ కావచ్చోని వినికిడి. కాగా జాదవ్ తన కేరిర్‌లో 91మ్యాచ్‌ల్లో 1181 పరుగులు సాధించాడు. రాబిన్ ఉతప్ప రాబిన్ ఉతప్ప తన ఐపీఎల్ కెరీర్ ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ప్రారంభించాడు. 2014 నుంచి 2019 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున అద్భతంగా రాణించాడు. 2014 సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2021 మొదటి దశలో చెన్నై తరుపున ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు విడ్కోలు పలకవచ్చని సమాచారం. చదవండి: IPL 2021 2nd Phase CSK VS MI: రుతురాజ్ మెరుపులు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ 157 -
Covid-19: కోలుకున్న క్రికెటర్.. ఇంగ్లండ్ టూర్‌కు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నీలో కరోనా వైరస్ బారిన పడ్డ భారత జట్టు వికెట్ కీపర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సాహాకు మార్గం సుగమం అయ్యింది. ఢిల్లీలో క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు నెగెటివ్ రావడంతో అతను కోల్‌కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇక అక్కడ కొన్ని రోజు లు గడిపిన తర్వాత ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెట్టనున్నాడు. అయితే ఇంగ్లండ్‌కు వెళ్లేలోపు సాహా తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. జూన్ 2న భారత్ అక్కడికి బయలుదేరనుంది. మరోవైపు.. ఐపీఎల్-2021 సీజన్ ఆడే క్రమంలో కోవిడ్ బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కూడా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన అతడు.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: WTC Final: అందుకే వాషింగ్టన్‌తో కలిసి ఉండటం లేదు! The real heroes. Our Frontline workers. All I can say post my recovery is, You have my support and heartfelt appreciation for all you do. We are deeply grateful to you for all the sacrifices that you and your family are making. .#grateful #coronawarriors #bcci #DelhiCapitals pic.twitter.com/Wg3vbqd42j — Amit Mishra (@MishiAmit) May 18, 2021 -
IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్!
న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి ఎలా సోకిందో బోర్డుకు అంతుచిక్కడం లేదు. ఎక్కడో ఏదో చిన్న నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యాన్నే బోర్డు చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ బయోబబుల్ లీక్‌కు.. మొదట కోల్‌కతా నైటరైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తికి.. అక్కడి నుంచి సందీప్ వారియర్.. అక్కడి నుంచి అమిత్ మిశ్రాకు వైరస్ సోకడం వెనుక నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా తమకిష్టమైన ఐపీఎల్ వాయిదాకి వరుణ్ కారణమంటూ సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ చేస్తూ అభిమానులు వాళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయోబబుల్ ఉల్లంఘన ఎక్కడ జరిగింది? ఇటీవల ఓ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరణ్‌ని గ్రీన్ చానెల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భుజం గాయం కావడంతో స్కానింగ్ చేసినట్లు అందరికి చెప్పారు. కానీ అతనికి భుజ గాయం కాలేదని, కడుపులో మంటతో బాధపడడంతో చికిత్స అందించారని తెలుస్తోంది. అక్కడి నుంచి హోటల్ రూమ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ నిబంధనల ప్రకారం వారం రోజులు క్వారంటైన్లోకి వెళ్లాలి. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నేరుగా వెళ్లి సందీప్‌తో కలిశాడు. ఇక్కడ రూల్ బ్రేక్ అయ్యింది. అదే క్రమంలోనే ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో మాట్లాడాడు. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది లీగ్ వాయిదాకు కారణమైనట్లు భావిస్తున్నారు. అందుకే బోర్డు దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు బయోబబుల్ లీక్ పై విచారణ జరిపిస్తోంది. వరుణ్‌పై సెటైరికల్ మీమ్స్ ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాకు వరుణ్ చక్రవర్తి కారణమంటూ అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సామాజిక మాధ్యమంలో వరుణ్‌పై సెటైరికల్ మీమ్స్, కామెంట్స్ పెడుతున్నారు.‘గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ వరుణ్ చక్రవర్తి’ అని ఒకరంటే.. ‘డ్రీమ్ 11 సీజన్ క్యాన్స్‌లర్ అవార్డు అతనికేనని’ మరొకరు వ్యంగ్యంగా అతనిపై ట్వీట్ చేస్తున్నారు. వాళ్లు వరుణ్ ఫొటోను ఎడిటింగ్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పాపం వరుణ్ నెటిజన్లుకు ఇలా బుక్కయ్యాడు. ( చదవండి: భారత్‌ను విడిచిపెట్టి వెళ్తున్నా.. నన్ను క్షమించండి ) #iplcancel #iplpostponed #COVIDSecondWaveInIndia #COVIDEmergencyIndia #VarunChakravarthy pic.twitter.com/Rh3ZzamrmT— Gotu Manthan Dave (@GotuDave) May 4, 2021 Dream11 Game Changer of the tournament #ipl2021 goes to #VarunChakravarthy pic.twitter.com/6BZTQ6wPta— Hibernator 🐺 (@PrestigiouStark) May 4, 2021 Suspending IPL is ok but What about suspending @KKRiders . For not following rules & allowing #VarunChakravarthy to join team without quarantine & played match. Bcoz of this 1 wrong decision & match jeetne ki lalach best playing11 ko leke Result- Whole #IPL2021 suspended@BCCI — Jadhav Ashish (@im_jadhavashish) May 4, 2021 -
IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ
-
IPL 2021 నిరవధిక వాయిదా: బీసీసీఐ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్కే రెండో స్థానంలో ఉంది. వాయిదా వేస్తాం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021)కు కరోనా సెగ తగిలింది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. కాగా, ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం జరగాల్సిన కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 8 ఫ్రాంఛైజీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాయి. కాగా ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బాంబే హైకోర్టులో పిటిషన్ కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను రద్దు చేయాలని పిటిషన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్‌కు కేటాయించిన వనరులను కోవిడ్ రోగులకు ఉపయోగించవచ్చని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. రద్దు చేస్తేనే మంచిది.. భారత్‌లో రోజూవారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలంటూ మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వహణ రద్దు అంశంపై sakshi.com నిర్వహించిన పోల్‌లోనూ ఈ విషయం నిరూపితమైంది. ఐపీఎల్‌ను ఆపేస్తేనే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. చదవండి: వైరల్: డ్రింక్స్ మోసుకెళ్లినా.. వి లవ్ యూ వార్నర్ అన్నా! IPL suspended for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI#COVID19 pic.twitter.com/K6VBK0W0WA — ANI (@ANI) May 4, 2021 -
'రికార్డుల కోసం నేను ఎదురుచూడను'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడం వెనుక సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలకంగా వ్యవహరించాడు. 4 ఓవర్లు వేసిన మిశ్రా 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మలింగ తొలి స్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు ఐపీఎల్లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీయగా.. అమిత్ మిశ్రా 152 మ్యాచ్‌లాడి 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి మిశ్రా కేవలం 7 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో ఇంకా ఢిల్లీ చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మిశ్రా ఈ రికార్డును తొందరగానే బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే తాను రికార్డులు సాధించడం కంటే జట్టును గెలిపించడంపైనే ఫోకస్ పెట్టినట్లు మిశ్రా తెలిపాడు. మ్యాచ్ విజయం అనంతరం పృథ్వీ షాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''నేనెప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. అసలు లసిత్ మలింగ రికార్డు బ్రేక్ చేయబోతున్నానే విషయం నాకు తెలియదు. రాబోయే మ్యాచ్‌ల్లో దానిని బ్రేక్ చేసినంత మాత్రానా నాకు వచ్చేది ఏం లేదు.. కేవలం ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరు తప్ప.. ప్రస్తుతం నా దృష్టంతా వికెట్లు తీసి ఢిల్లీ జట్టును గెలిపించడమే..'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్‌శర్మను ఐపీఎల్లో 7సార్లు ఔట్ చేయడంపై మిశ్రాను అడగ్గా.. '' రోహిత్‌కు బౌలింగ్ వేసేటప్పుడు అతను హిట్టింగ్ చేయకుండా వైవిధ్యమైన బంతులు వేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీస్తాను. అందులోనూ నేను వేసే వాటిలో ఎక్కువగా ఫ్లైట్ డెలివరీలు ఉండడంతో రోహిత్ అవుటవుతున్నాడు. అయితే రోహిత్ నా బౌలింగ్‌లో ఏడు సార్లు ఔటయ్యాడన్న విషయం నాకు తెలియదు.'' అంటూ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. చదవండి: మిశ్రా నువ్వు తోపు.. వచ్చీ రావడంతోనే ఐపీఎల్ 2021: అతను వండర్స్ చేయగలడు -
ఢిల్లీకి అమితానందం
గత సీజన్ ఫైనలిస్టుల మధ్య జరిగిన పోరు ప్రేక్షకులకు వినోదాన్ని పంచలేదు. ఆసక్తి కలిగించనూ లేదు. కానీ గతేడాది ఫైనల్లో తమను ఓడించి ఐపీఎల్‌లోనే ‘ఫైవ్ స్టార్ చాంపియన్’ జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. అమిత్ మిశ్రా మాయాజాలం... శిఖర్ ధావన్ నిలకడ... వెరసి వరుస మ్యాచ్‌ల విజయాలతో జోరు మీదున్న ముంబైని నేలకి దించిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై: ఈ మ్యాచ్‌లో స్కోర్లు తక్కువే! ఆటగాళ్ల జోరు తక్కువే! బౌండరీలు, సిక్సర్లు ఇలా అన్నీ తక్కువే! విజయం సులువుగా ఏమీ దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 20వ ఓవర్‌దాకా పోరాటం చేసింది. చివరకు 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చి విజయానందాన్ని పొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఆరంభంలోనే దెబ్బ... మూడో ఓవర్లోనే ముంబైకి తొలిదెబ్బ తగిలింది. స్టొయినిస్ ఓపెనర్ డికాక్ (2)ను కీపర్ క్యాచ్‌తో పంపించాడు. కానీ రోహిత్ ఉన్నాడన్న ధీమా... సూర్యకుమార్ యాదవ్ జతయ్యాడన్న విశ్వాసం ముంబై అభిమానుల్లో మెండుగా ఉంది. ఇది ఆ తర్వాతి ఓవర్లో కనిపించింది. అశ్విన్ బౌలింగ్‌లో సూర్య ఓ బౌండరీ బాదితే, రోహిత్ 4, 6 కొట్టాడు. అనంతరం రబడను ఫోర్, సిక్సర్‌తో ఇద్దరూ ఆడుకున్నారు. ఒక్కసారిగా ఇన్నింగ్స్‌కు జోరు తెచ్చిన మురిపెం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టనేలేదు. మిశ్రా మాయ... ముందుగా సూర్యకుమార్ (15 బంతుల్లో 24; 4 ఫోర్లు)ను అవేశ్ ఖాన్ ఔట్ చేస్తే... ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ ముంబై పాలిట శరాఘాతమైంది. స్పిన్నర్ మిశ్రా... కెపె్టన్ రోహిత్ శర్మ, హిట్టర్ హార్దిక్ పాండ్యా (0)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కృనాల్ పాండ్యా (1) వచి్చనా, పొలార్డ్ బ్యాటింగ్‌కు దిగినా ముంబైని ఆదుకోలేకపోయారు. కృనాల్‌ను లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేస్తే, ఆ మరుసటి ఓవర్లోనే మిశ్రా పొలార్డ్‌ను ఎల్బీగా దొరకబుచ్చుకున్నాడు. ఉన్నంతలో ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్), జయంత్ యాదవ్ (22 బంతుల్లో 23; 1 ఫోర్) చేసిన రెండంకెల పరుగులు ముంబైని మూడంకెల స్కోరుదాకా తీసుకొచ్చాయి. ధావన్ నిలకడ... ఆరంభంలోనే ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (7) నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. జయంత్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్ ధావన్‌కు స్మిత్ జతయ్యాడు. ముంబై బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు కుదురుగా ఆడారు. రెండో వికెట్‌కు 53 పరుగులు జతయ్యాక పొలార్డ్ బౌలింగ్‌లో స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్‌తో కలిసి జట్టు స్కోరును ధావన్ లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. రాహుల్ చహర్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ధావన్ వరుసగా 6, 4 బాదాడు. అదే ఊపులో భారీషాట్‌కు యత్నించిన ధావన్ లాంగ్‌లెగ్‌లో కృనాల్ పాండ్యా చేతికి చిక్కాడు. కాసేపటికే కెపె్టన్ పంత్ కూడా (7) సింగిల్ డిజిట్‌కే చేరడంతో ముంబై గత మ్యాచ్‌ల్లాగే పట్టుబిగించే ప్రయత్నం చేసింది. లలిత్ పోరాటం... స్మిత్ ఔటయ్యాక బ్యాటింగ్‌కు దిగిన లలిత్ యాదవ్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విలువైన పోరాటం చేశాడు. పంత్ ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 115/4. విజయానికి 19 బంతుల్లో 23 పరుగులు కావాలి. ఈ దశలో వచ్చిన హెట్మెయిర్ (9 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) దూకుడు, లలిత్ యాదవ్ నిలకడ ఢిల్లీ జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్మిత్ (బి) మిశ్రా 44; డికాక్ (సి) పంత్ (బి) స్టొయినిస్ 1; సూర్యకుమార్ (సి) పంత్ (బి) అవేశ్ ఖాన్ 24; ఇషాన్ కిషన్ (బి) మిశ్రా 26; హార్దిక్ (సి) స్మిత్ (బి) మిశ్రా 0; కృనాల్ (బి) లలిత్ యాదవ్ 1; పొలార్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మిశ్రా 2; జయంత్ (సి అండ్ బి) రబడ 23; రాహుల్ చహర్ (సి) పంత్ (బి) అవేశ్ ఖాన్ 6; బుమ్రా (నాటౌట్) 3; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–9, 2–67, 3–76, 4–77, 5–81, 6–84, 7–123, 8–129, 9–135. బౌలింగ్: స్టొయినిస్ 3–0–20–1, అశ్విన్ 4–0–30–0, రబడ 3–0–25–1, అమిత్ మిశ్రా 4–0–24–4, అవేశ్ ఖాన్ 2–0–15–2, లలిత్ యాదవ్ 4–0–17–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి అండ్ బి) జయంత్ 7; ధావన్ (సి) కృనాల్ (బి) రాహుల్ చహర్ 45; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పొలార్డ్ 33; లలిత్ యాదవ్ (నాటౌట్) 22; రిషభ్ పంత్ (సి) కృనాల్ (బి) బుమ్రా 7; హెట్మెయిర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1–11, 2–64, 3–100, 4–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–23–0, జయంత్ 4–0–25–1, బుమ్రా 4–0–32–1, కృనాల్ 2–0–17–0, రాహుల్ చహర్ 4–0–29–1, పొలార్డ్ 1.1–0–9–1.