ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే.. కానీ ఫ్యాన్‌ ఫ్యాన్స్‌ని.. | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే.. కానీ ఫ్యాన్‌ ఫ్యాన్స్‌ని..

Published Sat, Apr 20 2024 10:30 AM

- - Sakshi

పశ్చిమగోదావరి డెస్క్‌: అవును నేను ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే.. కానీ ఫ్యాన్‌ ఫ్యాన్స్‌ని.. అంటున్నారట ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పలువురు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. తమ సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడుకునే సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు చూసి వారి సన్నిహితులు.. ఏమైందన్నా నీ మైండ్‌ ఖరాబైందా అని అంటున్నారంట. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావ్‌.. నేను మాత్రం జగన్‌ ప్రజలకు చేస్తున్న సేవకే ఫ్యాన్స్‌ అయ్యానంటున్నావ్‌.. ఇదేందన్నా అని ప్రశ్నిస్తున్నారంట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థిస్తూ జనం దగ్గరికి వెళుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. పలువురు జనం జగన్‌ అందించిన పథకాలతో తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మా రాయని.. తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు జగనన్న బాటలు వేస్తున్నాడని.. పింఛన్లు తమ ఇంటికే వలంటీర్లను పంపించి అందిస్తున్నాడని.. తమ ఎదుటే ఎలాంటి బెరుకూ భయం లేకుండా చెబుతుండటం చూసి అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారట. ఇక చేసేదేమీ లేక తమ ప్రభుత్వం వచ్చినా అవన్నీ అమలు చేస్తామని చె బుతున్నారట. అయితే.. ఇవన్నీ జగనన్నే ఎలాంటి ఇబ్బందీ లేకుండా అమలు చేస్తుంటే.. ఇంక మీకెందుకు ఓటేయడం.. అని ప్రశ్నిస్తు న్నారట. దీంతో ఆయా అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారట. ఎక్కడికి వెళ్లినా.. కొంతమంది ముక్తసరిగా, మొక్కుబడి గా ముఖంలో లేని నవ్వు పులుముకొని కనిపిస్తుండటం గమనించిన నేతలు.. వారి ఓటు కచ్చితంగా తమకు పడదని ఫిక్సయి పోతున్నారంట. ఈ పరిస్థితులపై ఒక్కసారి లోతుగా ఆలోచిస్తున్న నేతలు.. సీఎం జగన్‌ పేదల జీవితాల్లో ఎంతటి మార్పు తెచ్చాడో కదా అని అనుకుంటున్నారంట. అదే విషయాన్ని తమ అనుయాయుల వద్ద ప్రస్తావిస్తే.. అవునన్నా మాకూ జగన్‌ ఇచ్చిన పథకాలు అందుతున్నాయ్‌.. కానీ మనం తొలి నుంచీ ఈ పార్టీనే నమ్ముకుని ఉన్నాం కాబట్టి.. ఇందులోనే తిరుగుతున్నాం.. అంటూ అసలు విషయం చెబుతున్నారంట. దీనిని బట్టి చూస్తే తమ అనుచరుల ఓట్లు తమకు పడినా.. వారి కుటుంబసభ్యుల ఓట్లు మాత్రం తమకు పడతాయనే గ్యారెంటీ లేదని ఆయా అభ్యర్థులు అయోమ యంలో పడుతున్నారంట. ఈ నేపథ్యంలోనే జ గన్‌ విజన్‌కు సలామ్‌ కొడుతూ.. నేను కూడా ఫ్యాన్‌ ఫ్యాన్సే అంటున్నారంట. కానీ తనకే ఓటు వేసి గెలిపించాలని మాత్రం ఓటర్లను ఇంటింటికీ వెళ్లి బతిమాలుకుంటున్నారంట. అదండీ సంగతి!

Advertisement
 
Advertisement
 
Advertisement