క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

Published Tue, Apr 23 2024 8:15 AM

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ డీన్‌ రామగోపాల్‌  
 - Sakshi

ఆదోని అర్బన్‌: ఐపీఎల్‌–2024 సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలు నగదు, నాలు గు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం ఎమ్మిగనూరు బైపాస్‌ వద్ద కల్వారి కొండ సమీపంలో ముళ్లకంపల చెట్ల కింద క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా ఆదోని పట్టణం మరాఠీగేరికి చెందిన మహానంది, రమేష్‌, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షహీద్‌, ఆదోని పట్టణం కార్వన్‌పేటకు చెందిన బెస్త వినోద్‌లను అరెస్ట్‌ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలు నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. జల్సాల కోసం వీరు క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. త్రీ టౌన్‌ సీఐ నరసింహరాజు, పోలీసు సిబ్బంది లక్ష్మన్నస్వామి, నరేంద్ర, పరశురామ్‌, పరమేష్‌, గిరిబాబు, నరసింహులు, ఇస్మాయిల్‌లు తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని గుడేకల్‌ ఎల్‌ఎల్‌సీ కాలువ సమీపంలో ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో బోయ లక్ష్మన్న (28) మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. గుడేకల్‌కు చెంది న లక్ష్మన్న, భార్య నారాయణమ్మ పుట్టినిళ్లైన పెద్దకడబూరు మండలం హనుమాపురానికి వెళ్లింది. లక్ష్మన్న ఆదివారం రాత్రి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌పై భార్య వద్దకు వెళ్తుండగా ఆదోని వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. బైక్‌ రోడ్డు పక్కనున్న ముళ్ల పొదల్లో పడగా లక్ష్మన్న గుంతలో పడిపోయాడు. ఢీకొట్టిన వ్యక్తి కారును వదిలి పారిపోయాడు. సోమవారం ఉదయం ఆ మార్గంలో వెళ్లిన వారు బైక్‌ను గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా లక్ష్మన్న మృతదేహం కనిపించింది. మృతుడి భార్య నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

పర్యావరణాన్ని విస్మరిస్తే భవిష్యత్‌ అంధకారం

కోవెలకుంట్ల: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వా తావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్‌ అంధకారమంతుందని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ డీన్‌ (కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌), భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ రామగోపాల్‌ అన్నారు. స్థానిక వాసవీ బొ మ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ అధ్యక్షతన జాతీయ సె మినార్‌ కార్యక్రమం నిర్వహించారు. భౌతికశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్‌ పొల్యూషన్‌, సస్టెయినబుల్‌ మెటీరియల్స్‌ అనే అంశాలపై జరిగిన సెమినార్‌ కార్యక్రమంపై ఆయన విద్యార్థులనుద్ధేశించి ఆయన ప్రసగించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉ ద్యమంలా చేపట్టాలని సూచించారు. వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్‌ పొర దెబ్బతిని ప్రజానీకానికి, వ్యవసాయ రంగానికి హాని జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్‌జీఎం ఇంజనీరింగ్‌ కళాశాల భౌతిక శాస్త్ర అసోసియేట్‌ ప్రొఫె సర్‌ జమాలయ్య, బళ్లారి ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నర్సింహులు, కళాశాల అధ్యాపకులు దాసు, రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి,భాస్కర్‌రెడ్డి,క్రిష్ణశశాంక పాల్గొన్నారు.

బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు
1/1

బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు

Advertisement
Advertisement