యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? బహుశా 'అర్జున్ రెడ్డి' మూవీ ఏమో! ఈ సినిమా అతడికి ఎంత ప్లస్ అయిందో అంతకు మించిన మైనస్ కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే దీని తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఓ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. కానీ ఎందుకో హిట్ అనే మాట మాత్రం వినలేకపోతున్నాడు! ఇంతకీ విజయ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు? అసలేం జరుగుతోంది?
(ఇదీ చదవండి: స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!)
బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే ఏ రంగమైనా సరే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి నిలబడ్డాడు. సైడ్ క్యారెక్టర్స్, పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వచ్చాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో రిషి అనే కీలక పాత్ర చేసి నటుడిగా నలుగురి కంట్లో పడ్డాడు. 'పెళ్లిచూపులు' మూవీతో ఫస్ట్ హిట్ కొట్టేశాడు. ఇక 'అర్జున్ రెడ్డి' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విజయ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎవరిని అడిగినా అదే చెప్తారు.
ఇందులో విజయ్ యాక్టింగ్, ఆటిట్యూడ్, మేనరిజమ్స్.. ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దీని తర్వాత చేసిన 'గీతగోవిందం' మూవీ విజయ్‌లోని క్యూట్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అలా వరసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో విజయ్‌ని ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్ అనే రేంజులో ఆకాశానికెత్తేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో విజయ్ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు.
(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?)
నోటా, ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్.. ఇలా విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నీ కూడా ఎందుకో ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేకపోయాయి. అయితే 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. కానీ ఎందుకో కమర్షియల్ కథలతో మూవీస్ చేయడం.. విజయ్‌ని మిగతా హీరోలు అనిపించేలా చేసింది. ఎంత మంచి నటుడైనా సరే కాస్తోకూస్తో వైవిధ్యం ఉంటేనే జనాలు గుర్తిస్తారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్ చేస్తే ఉన్న క్రేజ్ అలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. విజయ్ కూడా ఈ విషయంలోనే తప్పటడుగులు వేస్తున్నాడా అనే డౌట్ వస్తోంది.
విజయ్ దేవరకొండ అద్భుతమైన నటుడు. దీనిలో వంక పెట్టడానికి ఏం లేదు. కానీ సరైన సినిమాలే ఎందుకో పడట్లేదు. విజయ్ ఈ విషయం కాస్త కాన్సట్రేట్ చేసి.. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా చేస్తే మాత్రం విజయ్.. మళ్లీ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ. కొత్త పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై కాస్త ఆలోచించాలని కోరుతూ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?)
Comments
Please login to add a commentAdd a comment