కేసీఆర్‌ రోడ్‌ షోను విజయవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ రోడ్‌ షోను విజయవంతం చేయాలి

Published Thu, May 9 2024 12:45 AM

కేసీఆర్‌ రోడ్‌ షోను   విజయవంతం చేయాలి

● ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా గురువారం కరీంనగర్‌లో నిర్వహించే కేసీఆర్‌ రోడ్‌షోను విజయవంతం చేయాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కోరారు. బుధవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో సమీక్షించారు. రోడ్‌షో జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. నియోజకవర్గ పరి ధి నుంచి పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు రోడ్‌ షోకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భాను ప్రసాద్‌రావు, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌, పెండ్యాల శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గడువు పెంపు

కరీంనగర్‌ అర్బన్‌: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్ని కల కమిషన్‌ మరో రెండు రోజుల గడువు పెంచిందని కలెక్టర్‌, ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 10 వరకు ఎ న్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందని, ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement