'Naatho Nenu' first look launched by Writer Vijayendra Prasad - Sakshi
Sakshi News home page

Naatho Nenu: ‘నాతో నేను’ టైటిల్‌ బాగుంది: విజయేంద్రప్రసాద్‌

Published Thu, Apr 13 2023 5:21 PM

Naatho Nenu First Look Launch By Writer Vijayendra Prasad - Sakshi

సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’.  ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌లో  విడుదల చేశారు. ‘టైటిల్‌ బాగుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’ అని అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ ‘మంచి కథతో శాంతికుమార్‌ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’అని అన్నారు. 

దర్శకుడు శాంతికుమార్‌ మాట్లాడుతూ ‘ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్‌ గారు అండగా ఉన్నారు. చక్కని సలహా సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను.. దానిని చక్కగా తెరపై చూపిస్తానని, ఆ దిశగా కృషి చేస్తానని చెబుతున్నాను’ అని అన్నారు. 

నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథనచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. బిజీగా ఉండి కూడా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన విజయేంద్రప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించబోతున్నాం’ అని అన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement