Sumalatha Emotional Note On Her Late Husband Ambareesh on 31st Wedding Anniversary - Sakshi
Sakshi News home page

Sumalatha: అవే నా జీవితంలో గొప్ప బహుమతులు.. సీనియర్ నటి సుమలత ఎమోషనల్

Published Thu, Dec 8 2022 4:54 PM

Sumalatha Emotional Note On her late husband Ambareesh on 31st wedding anniversary  - Sakshi

కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లో అభిమానుల మనసులు గెలుచుకున్న సీనియర్ నటి సుమలత. తెలుగులో అగ్రహీరోలతో పలు సినిమాల్లో ఆమె నటించింది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణతోనూ పలుచిత్రాల్లో ఆమె జంటగా కనిపించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. ఆమె వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్‌ను తలుచుకుంటూ ఓ నోట్‌ను విడుదల చేసింది. 

(ఇది చదవండి: ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి)

నోట్‌లో సుమలత రాస్తూ.. 'ఈ రోజు గాలిలో మీ గొంతు విని నేను మీ ముఖం వైపు తిరిగా. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నప్పుడు గాలి వెచ్చదనం నన్ను తాకింది. నీ ఆలింగనం కోసం నేను కళ్లు మూసుకున్నా. నేను కురుస్తున్న వానను చూస్తూ కిటికీలో నుంచి చూశా. ప్రతి వాన చినుకులో మీ పేరు వినిపించింది.ఈరోజు నేను నిన్ను నా హృదయంలో దాచుకున్నా. అది నాకు సంపూర్ణమైన అనుభూతిని కలిగించింది. నువ్వు చనిపోయి ఉండొచ్చు.. కానీ నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు. ఎప్పుడూ నాలో భాగమై ఉంటావు. సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం గాలి వీస్తుంది. వర్షం కురుస్తుంది. అలాగే నువ్వు నాలో ఎప్పటికీ నివసిస్తావు. అది నా హృదయానికి తెలుసు.' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

సుమలత, అంబరీష్ ప్రేమకథ:  సుమలత డిసెంబర్ 8న 1991న కన్నడ నటుడు,రాజకీయ నాయకుడు అంబరీష్‌ని వివాహం చేసుకున్నారు.  వీరికి ఒక కుమారుడు అభిషేక్ గౌడ జన్మించారు. అంబరీష్ 1984లో కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారిగా కలిసిన తర్వాత నటి సుమలతతో స్నేహాన్ని పెంచుకుని మరింత దగ్గరయ్యారు. కాగా.. 24 నవంబర్ 2018న అంబరీష్ గుండెపోటుతో మరణించారు. కన్నడ సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు నివాళులర్పించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించారు. 

(ఇది చదవండి: సాంగ్‌ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట)

అనే నా జీవితానికి గొప్ప బహుమతి: సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఆ రోజు నీతో నడిచిన క్షణం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్‌ పార్టనర్‌గా నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాలో ఏదో కొత్త ఉత్సాహం. ఆ రోజుని పదే పదే గుర్తు చేస్తూ పెళ్లినాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ రోజుని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటా. ‍మన 31 ఏళ్ల వివాహబంధంలో జీవితకాల జ్ఞాపకాలను నాటారు. మీరు అందించిన ప్రేమ, ఆప్యాయతలు నా జీవితానికి బహుమతులు' అంటూ ఎమోషనల్ అయ్యారు సీనియర్ నటి సుమలత. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement