Shocking Video: Bride And Groom Playing Mobile Games During Wedding - Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా?

Published Thu, Sep 9 2021 6:05 PM

Bride And Groom Playing Game In Mobile Phone In Their Wedding - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌:  కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో కొందరు యువతీయువకులు తమ వివాహాలను భిన్నంగా.. కొత్త తరహాలో చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ యాసలో అద్భుతంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాట వివాహాల్లో మార్మోగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట పెళ్లిపీటలపై కూర్చుని ఫోన్‌లో గేమ్‌ ఆడడం వింతగా ఉంది. ఇద్దరు తమ తమ ఫోన్‌లలో ఆడుకుంటూ బిజీగా ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చదవండి: తాలిబన్ల అరాచకం.. జర్నలిస్టులకు చిత్రహింసలు

వారి వివరాలు తెలియరాలేదు. కానీ వారి వస్త్రధారణ చూస్తుంటే పశ్చిమబెంగాల్‌కు చెందిన వధూవరులుగా కనిపిస్తున్నారు. ఈ వీడియోను నిరంజన్‌ మహాపాత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఆ ఇద్దరు దంపతులు తమ మొబైల్‌ ఫోన్‌లలో పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘ఫ్రీ ఫైర్‌’ ఆడుకుంటూ కనిపించారు. శత్రువులను చంపుతూ నవ్వుకుంటూ.. మాట్లాడుకుంటూ వారు ఆడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వారిని తిట్టి పోస్తున్నారు. ఫోన్లు ఎంతటి దారుణ పరిస్థితులకు తీసుకువచ్చిందోనని ఓ పెద్ద మనిషి కామెంట్‌ చేశారు. జై పబ్జీ లవర్స్‌ అంటూ మెసేజ్‌ చేస్తున్నారు. ‘అది పబ్జీ కాదురా అయ్య ఫ్రీ ఫైర్‌’ మరికొందరు వివరణ ఇస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement