టీ20 వరల్డ్‌కప్ 2024లో సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్ (జూన్ 20, బార్బడోస్), బంగ్లాదేశ్ (జూన్ 22, ఆంటిగ్వా), ఆస్ట్రేలియా (జూన్ 24, సెయింట్ లూసియా) జట్లతో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లకు ముందు భారత ఆటగాళ్లకు మూడు రోజుల విశ్రాంతి లభించింది. ఈ ఖాళీ సమయాన్ని టీమిండియా ఆటగాళ్లు సరదాగా ఆస్వాధిస్తున్నారు. సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌కు (ఆఫ్ఘనిస్తాన్) వేదిక అయిన బార్బడోస్‌కు ఇదివరకే చేరుకున్న భారత ఆటగాళ్లు స్థానిక బీచ్‌లో వాలీబాల్ ఆడుతూ సేద తీరారు.
📍 Barbados
Unwinding at the beach 🌊, the #TeamIndia way! #T20WorldCup pic.twitter.com/4GGHh0tAqg— BCCI (@BCCI) June 17, 2024
విరాట్ కోహ్లి, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ తదితరులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి బార్బడోస్ సాగర తీరాన వాలీబాల్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది.
కాగా, గ్రూప్ దశలో భారత్ ఆడాల్సిన చివరి మ్యాచ్ (కెనడా) వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. భారత్ గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ నుంచి భారత్‌తో (A1) పాటు యూఎస్‌ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.
సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.
సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్‌ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.
Team India. 🥶🇮🇳 pic.twitter.com/tE8TVVd9Pv
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2024
సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..
జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)
జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)
జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)
జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)
సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..
జూన్ 19- యూఎస్‌ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)
జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)
జూన్ 21- యూఎస్‌ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)
జూన్ 23- యూఎస్‌ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)
జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
Comments
Please login to add a commentAdd a comment