రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు

Published Fri, Jan 26 2024 4:16 PM

Republic Day 2024 Nari Shakti Rules Ram Lalla Tableau  - Sakshi

ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారత్ సాంస్కృతిక వైవిధ్యాన్ని, సైనిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అయోధ్య రాముడు, చంద్రయాన్-3  శకటాలు అందర్నీ ఆకర్షించాయి. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది.

► 'విక్షిత్ భారత్', 'భారత్ - లోక్తంత్రకి మాతృక' అనే జంట థీమ్‌ల ఆధారంగా ఈ ఏడాది జరిగిన కవాతులో 13,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. 

► మొదటిసారిగా, శంఖం, నాదస్వరం, నగడ వంటి భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ 100 మంది మహిళా కళాకారులు కవాతును ప్రారంభించారు.

► కర్తవ్య మార్గంలో మహిళలతో కూడిన ట్రై-సర్వీస్ బృందం తొలిసారిగా కవాతు చేసింది. మహిళా పైలట్లు కూడా 'నారీ శక్తి'ని సూచిస్తూ ఫ్లై పాస్ట్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) దళం కూడా పూర్తిగా మహిళా సిబ్బందిని కలిగి ఉంది.

► భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ప్రదర్శించిన చంద్రయాన్-3, ఆదిత్య ఎల్‌1 శకటం ఆకట్టుకుంది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఇందులో పొందుపర్చారు. మహిళా శాస్త్రవేత్తలు ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్‌ను కూడా చూపించారు.

► అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన బాల రాముని శకటం ఆకర్షించింది. రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. బాల రాముడు విల్లు, బాణాలు ధరించిన రూపాన్ని శకటంలో రూపొందించారు. 

► దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైతోంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పడానికి ఎన్నికల సంఘం ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ఆకర్షణగా నిలిచింది. 

► కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఢిల్లీ పోలీసుల బృందాలకు మహిళా సిబ్బంది నాయకత్వం వహించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాంటింజెంట్‌కి అసిస్టెంట్ కమాండెంట్ మోనికా లక్రా నాయకత్వం వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ తన్మయీ మొహంతి నాయకత్వం వహించారు.  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ మేఘా నాయర్ లీడర్‌గా వ్యవహరించారు.   

ఇదీ చదవండి: భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక


 

Advertisement
 
Advertisement
 
Advertisement