Jagga Reddy Says BL Santosh And Kavitha Should Be Arrest Immediately - Sakshi
Sakshi News home page

బీఎల్‌ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ‍ప్రయత్నిస్తోంది: జగ్గారెడ్డి

Published Fri, Dec 2 2022 5:05 PM

Jagga Reddy Says BL Santosh And Kavitha Should Be Arrest Immediately - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం​ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. 

ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో బీఎల్‌ సంతోష్‌కు సిట్‌ నోటీసులు పంపి విచారణకు రావాలని కోరిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, లిక్కర్‌ స్కాం, ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి. 

బీఎల్‌ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ‍ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయి. వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని కామెంట్స్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement