సత్వర లాభాలపై ఆశతోనే
రిటైల్ ఇన్వెస్టర్ల ధోరణిపై నిపుణులు
న్యూఢిల్లీ: సత్వర లాభాలపై ఆశలు, స్పెక్యులేటివ్ ధోరణులే రిటైల్ ఇన్వెస్టర్లను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు రిస్క్ ల గురించి ఆలోచించకుండా ట్రేడింగ్‌లోకి దూకి, చేతులు కాల్చుకుంటున్నారు. అలా జరగకుండా ఎఫ్‌అండ్‌వోపై పూర్తి అవగాహన పెంచుకుని, రిస్క్ లను ఎలా ఎదుర్కొనాలనేది తెలుసుకుని మాత్రమే ఇందులోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
రిస్క్ లతో కూడుకున్న ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తుండటంపై కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ మాధవిపురి బచ్ తదితరులు ఈ సాధనం విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. అయినప్పటికీ ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ భారీగా పెరుగుతూనే ఉంది.
2019లో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్ నెలవారీ టర్నోవరు 8,740 లక్షల కోట్లుగా ఉండేది. ఇది 2024 మార్చి నాటికి ఏకంగా రూ. 217 లక్షల కోట్లకు ఎగిసింది. సెబీ అధ్యయనం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం మంది నష్టపోయారు. నష్టాలు సగటున రూ. 1.1 లక్షలుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ అనేది హెడ్జింగ్, స్పెక్యులేషన్ కోసం ఉపయోగకరంగా ఉంటుందని, కానీ అధిక స్థాయిలో మార్జిన్లు అవసరమవుతాయి కాబట్టి రిస్క్ లు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఫైయర్స్ సహ–వ్యవస్థాపకుడు తేజస్ ఖోడే చెప్పారు. వీటి వల్ల చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
కాబట్టి ఈ సాధనాలు, వాటిలో ఉండే రిసు్కల గురించి రిటైల్ ఇన్వెస్టర్లు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయడం మంచిదని సూచించారు. ‘ఈ సాధనాలకు అవసరమైన పెట్టుబడి తక్కువగానే ఉండటం, వివిధ సూచీల్లో వీక్లీ ఎక్స్‌పైరీలు కూడా అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ లు కూడా పెరిగాయి‘ అని ఆనంద్ రాఠీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment