IND VS AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల
Published
Tue, Mar 26 2024 2:31 PM
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా మారింది.
ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్‌గా సాగనుంది. పింక్ బాల్‌తో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టికెట్లు జూన్ 4 నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి. ఇటీవలికాలంలో జరిగిన నాలుగు BGT సిరీస్‌లను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదో సిరీస్‌పై కన్నేసింది. భారత్ 2017, 2019, 2021, 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్..
నవంబర్ 22-26- పెర్త్
డిసెంబర్ 6-10- అడిలైడ్ ఓవల్ (డే అండ్ నైట్, పింక్ బాల్ టెస్ట్)