Ind Vs Aus: Cameron Green Smashes Maiden International Century Against IND During 4th Test - Sakshi
Sakshi News home page

Cameron Green: డెబ్యూ శతకం.. టీమిండియాపైనే బాదాలా?

Published Fri, Mar 10 2023 1:44 PM

Cameron Green Smashes Maiden International Century Vs IND 4th Test - Sakshi

ఆస్ట్రేలియా బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ టెస్టుల్లో తొలి శతకం సాధించాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్‌ ఈ ఘనత అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై యథేచ్చగా బ్యాట్‌ ఝులిపించిన గ్రీన్‌ 143 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం మార్క్‌ సాధించాడు. కాగా గ్రీన్‌కు టెస్టుల్లో ఇదే తొలి శతకం. టీమిండియా గడ్డపై టెస్టుల్లో డెబ్యూ శతకం అందుకున్న అరుదైన ఆసీస్‌ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు.

అంతేకాదు ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి గ్రీన్‌ ఐదో వికెట్‌కు 208 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్‌ తరపున టీమిండియా గడ్డపై టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ పార్ట్‌నర్‌షిప్‌ కావడం విశేషం. తొలి స్థానంలో 1979-80లో చెన్నై వేదికగా అలెన్‌ బోర్డర్‌- హ్యూజెస్‌లు కలిసి 222 పరుగులు జోడించారు. ఇక మూడో స్థానంలో ఓ నీల్‌- హార్వే జంట 1959-60లో ముంబై వేదికగా 207 పరుగులు జోడించారు.

అయితే డెబ్యూ సెంచరీ అందుకున్న కామెరాన్‌ గ్రీన్‌ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేళ టీమిండియా అభిమానులు మాత్రం వినూత్న రీతిలో స్పందించారు. తొలి టెస్టు శతకం అందుకున్నందుకు కంగ్రాట్స్‌.. కానీ పోయి పోయి టీమిండియాపైనే అది సాధించాలా అంటూ కామెంట్‌ చేశారు. అయితే సెంచరీ తర్వాత మరో 14 పరుగులు చేసిన గ్రీన్‌ 114 వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

చదవండి: 'డొమెస్టిక్‌ లీగ్స్‌ వల్ల ప్రమాదంలో ఐసీసీ గ్లోబల్‌ క్రికెట్‌'

'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్‌ భరత్‌కు కోహ్లి ఆదేశం

Advertisement
 
Advertisement
 
Advertisement