Sakshi News home page

IPL 2024: కేకేఆర్‌ క్యాంప్‌లో జోష్‌ నింపుతున్న మిచెల్‌ స్టార్క్‌

Published Wed, Mar 20 2024 7:41 PM

IPL Costliest Pick Mitchell Starc Is Set The Fire - Sakshi

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్యాంప్‌లో కొత్త జోష్‌ నింపుతున్నాడు. ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని జట్లతో పాటు కేకేఆర్‌ కూడా ప్రాక్టీస​ ముమ్మరం చేసింది. కేకేఆర్‌ విషయానికొస్తే.. స్టార్క్‌ ఆ జట్టుకు తరుపుముక్కగా పరిగణించబడుతున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో స్టార్క్‌ పేట్రేగిపోతున్నాడు.

నిప్పులు చెరిగే బంతుల సంధిస్తూ సహచరులను తెగ ఇబ్బంది పెడుతున్నాడు. తాజాగా స్టార్క్‌ సహచర ఆటగాడిని ఎల్బీడబ్ల్యూ చేసే వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇందులో స్టార్క్‌ మెరుపు వేగంతో బంతిని సంధిస్తూ కనిపించాడు. సహజంగానే మెరుపు వీరుడిగా పేరున్న స్టార్క్‌ ఇంత భారీ మొత్తం తనపై పెట్టుబడి పెట్టడంతో ఇంకాస్త విజృంభించే అవకాశం ఉంది.

కేకేఆర్‌ యాజమాన్యం స్టార్క్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. గంభీర్‌ మెంటార్షిప్‌లో కేకేఆర్‌ కొత్త రక్తంతో ఉరకేలుస్తుంది. ఈసారి ఎలాగైనా మూడో ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలని ఆ జట్టు యాజమాన్యం కంకణం కట్టుకు కూర్చుంది. ఐపీఎల్‌ 2024 వేలంలో కేకేఆర్‌ స్టార్క్‌ను 24.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిం‍దే.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్‌) వేదికగా జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆర్సీబీతో తలపడుతుంది. కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌.. ఆరెంజ్‌ ఆర్మీను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.

తొలి విడదలో ప్రకటించిన షెడ్యూల్‌ వరకు కేకేఆర్‌ మార్చి 29, ఏప్రిల్‌ 3న మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. 29న జరిగే తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో (బెంగళూరు), 2న జరిగే మరో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (విశాఖ) కేకేఆర్‌ తలపడనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్,  చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. 

గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్.

Advertisement

What’s your opinion

Advertisement