ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. తొలుత జేక్ ఫ్రేసర్ (27 బంతుల్లో 84; 11 ఫోర్లు, 6 సిక్సర్లు), షాయ్ హోప్ (17 బంతుల్లో 41; 5 సిక్సర్లు), ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఫలితంగా ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్.
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్), రిషబ్ పంత్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (6 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో లూక్ వుడ్, బుమ్రా, పియూశ్ చావ్లా, నబీ తలో వికెట్ పడగొట్టారు.
ట్రిస్టన్ స్టబ్స్ ఊచకోత
లూక్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ ఓవర్‌లో స్టబ్స్ ఐదు బౌండీరలు, ఓ సిక్సర్ కొట్టి (4,4,6,4,4,4) 26 పరుగులు పిండుకున్నాడు. స్టబ్స్ ధాటికి కేవలం రెండో మ్యాచ్ ఆడుతున్న వుడ్ బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన వుడ్ ఓ వికెట్ తీసి 68 పరుగులు సమర్పించుకున్నాడు.
ఫలితంగా వుడ్ ఐపీఎల్ చరిత్రలో ఐదో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు మోహిత్ శర్మ పేరిట నమోదై ఉంది. మోహిత్ ఇదే సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో వికెట్ లేకుండా 73 పరుగులు సమర్పించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment